వెర్షన్:v20240307

Xiaomi గోప్యతా విధానం

మా గోప్యతా విధానం 15 జనవరి 2021న అప్‌డేట్ చేయబడింది.

దయచేసి కొంత సమయం కేటాయించి మా గోప్యత పద్ధతులను ఒకసారి సమీక్షించండి. మీకు ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించండి.

మా పరిచయం

Xiaomi Singapore Pte. Ltd., Xiaomi Technology Netherlands B.V., మరియు Xiaomi Groupలోని అన్ని అనుబంధిత కంపెనీలు (వివరణాత్మక జాబితా కోసం ఇక్కజ క్లిక్ చేయండి), ఉమ్మడిగా ఇప్పటి నుండి "Xiaomi", "మేము", "మా" లేదా "మా యొక్క" అని సూచించబడేవి మీ గోప్యతను ప్రధానంగా భావిస్తారు. ఈ గోప్యతా విధానం మీ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించినది, అలాగే మా గోప్యతా సమాచార సేకరణ మరియు వినియోగ పద్ధతుల గురించి మీరు తప్పనిసరిగా సమగ్ర అవగాహన కలిగి ఉండాలి. ముఖ్యంగా, Xiaomiకి అందించే మీ వ్యక్తిగత సమాచారంపై మీకు నియంత్రణ ఉంటుందనే భరోసా ఇస్తుంది.

ఈ గోప్యతా విధానం పరిచయం

స్వతంత్ర గోప్యతా విధానాన్ని కలిగి ఉండే నిర్దిష్ట Xiaomi ఉత్పత్తులు లేదా సేవలు మినహా, ఈ గోప్యతా విధానాన్ని సూచిస్తున్న లేదా దీనికి లింక్ కలిగి ఉన్న అన్ని Xiaomi పరికరాలు, వెబ్‌సైట్‌లు లేదా అప్లికేషన్‌లకు ఈ గోప్యతా విధానం వర్తిస్తుంది. మీరు (https://www.mi.com, https://en.miui.com, https://account.xiaomi.com) వెబ్‌సైట్‌ల నుండి యాక్సెస్ చేయగల మా ఉత్పత్తులు మరియు సేవలను ఉపయోగిస్తున్నప్పుడు అలాగే మా మొబైల్ పరికరాలలో మేము ఆఫర్ చేసేటటువంటి అప్లికేషన్‌లను ఉపయోగించే సమయంలోనూ మాకు అందజేసేటటువంటి లేదా మేము మీ నుండి సేకరించేటటువంటి మీకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని Xiaomi ఎలా సేకరిస్తుంది, ఏ విధంగా ఉపయోగిస్తుంది, ఏ విధంగా ప్రాసెస్ చేస్తుంది మరియు ఏ విధంగా రక్షిస్తుంది అనే వివరాలను ఈ గోప్యతా విధానం వివరిస్తుంది. ఏదైనా Xiaomi ఉత్పత్తి వేరొక గోప్యతా విధానాన్ని అందిస్తుంటే, ఆ గోప్యతా విధానానికి మొదటి ప్రాధాన్యత లభిస్తుంది, అందులో ప్రత్యేకంగా ప్రస్తావించని ఏవైనా విషయాలకు ఈ గోప్యతా విధానం నిబంధనలు వర్తిస్తాయి. అలాగే, నిర్దిష్ట ఉత్పత్తులు మరియు సేవలు మీ వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడంతోపాటు ప్రాసెస్ చేస్తుంది అనే విషయం మోడల్, సర్వీస్ వెర్షన్ లేదా ప్రాంతంపై ఆధారపడి మారవచ్చు. మరిన్ని వివరాల కోసం విడిగా ఉన్న గోప్యతా విధానాన్ని చూడాలి.

ఈ గోప్యతా విధానం ప్రకారం, "వ్యక్తిగత సమాచారం" అంటే ఒక వ్యక్తిని ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా గుర్తించడానికి ఉపయోగించే సమాచారం, మీ ప్రాంతంలోని నిర్దిష్టంగా వర్తించబడే చట్టాల ద్వారా మినహాయించబడితే తప్ప, Xiaomi కేవలం ఆ సమాచారం ద్వారా లేదా ఇతర సమాచారంతో మిళితమైన ఆ సమాచారం ద్వారా ఆ వ్యక్తితో సంప్రదింపులు జరపగలిగే సౌలభ్యాన్ని కలిగి ఉంటుంది. గోప్యతా విధానానికి లోబడి మేము మీ వ్యక్తిగత సమాచారాన్ని జాగ్రత్తగా ఉపయోగిస్తాము. సందర్భ ఆవశ్యకతను బట్టి, దానికి సంబంధించిన చట్టం క్రింద వర్గీకరించిన ప్రకారం వ్యక్తిగత సమాచారంలో గోప్యమైన వ్యక్తిగత డేటా లేదా సమాచారం కూడా ఉండవచ్చు.

మేము మీకు ఏ విధంగా సహాయపడగలము

చిట్టచివరిగా, మా వినియోగదారులందరికీ ఉత్తమ సేవలను అందించాలనేదే మా లక్ష్యం. ఈ గోప్యతా విధానంలో పేర్కొన్నట్లుగా వ్యక్తిగత సమాచారానికి సంబంధించి మేము నిర్వహిస్తున్న డేటా నిర్వహణ పద్ధతుల గురించి మీకు ఏవైనా సందేహాలు ఉంటే, మీ నిర్దిష్ట సమస్యలకు సమాధానం కోసం దయచేసి https://privacy.mi.com/support ద్వారా మమ్మల్ని సంప్రదించండి. మీ అభిప్రాయాలను తెలుసుకునేందుకు మేము సంతోషిస్తాము.

1. మేము ఏ సమాచారాన్ని సేకరిస్తాము మరియు దానిని ఏ విధంగా ఉపయోగిస్తాము

1.1 మేము ఏ సమాచారాన్ని సేకరిస్తాము

మేము మీకు మా సేవలను అందించడానికి అవసరమైన వ్యక్తిగత సమాచారాన్ని అందించాలని అభ్యర్థిస్తాము. మేము సమాచారాన్ని దాని నిమిత్తం పేర్కొన్న, వాస్తవమైన, విశిష్టమైన మరియు న్యాయపరమైన ప్రయోజనాల కోసం మాత్రమే సేకరిస్తాము. ఆ ప్రయోజనాలకు విరుద్ధంగా మరే విధంగానూ సదరు సమాచారాన్ని ప్రాసెస్ చేయమని హామీ ఇస్తున్నాము. మేము కోరినటువంటి సమాచారాన్ని అందజేసేటటువంటి లేదా నిరాకరించేటటువంటి హక్కుని మీరు కలిగి ఉంటారు, కానీ చాలా సందర్భాలలో, మీరు మీ వ్యక్తిగత సమాచారాన్ని అందజేయని పక్షంలో, మేము మా ఉత్పత్తులను లేదా సేవలను మీకు అందజేయడం లేదా మీ సమస్యలకు ప్రతిస్పందించడం వంటివి చేయలేకపోవచ్చు.

మీరు ఎంపిక చేసుకున్న సేవపై ఆధారపడి, మేము మీ నుండి క్రింది రకాల సమాచారాన్ని సేకరించవచ్చు:

1.1.1 మీరు మాకు అందజేసే సమాచారం

మీరు ఎంపిక చేసుకున్న సేవను పొందడం కోసం, మీరు మాకు అందించేటటువంటి ఏదైనా వ్యక్తిగత సమాచారాన్ని మేము సేకరించవచ్చు. ఉాదాహరణకు, మీరు mi.com రీటైలింగ్ సేవలను వినియోగిస్తున్నప్పుడు మీ పేరు, మొబైల్ ఫోన్ నంబర్, ఇమెయిల్ చిరునామా, డెలివరీ చిరునామా, ఆర్డర్ సమాచారం, ఇన్‌వాయిసింగ్ వివరాలు, బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఖాతాదారు పేరు, క్రెడిట్ కార్డ్ నెంబర్, ఇతర సమాచారం అందించవచ్చు; మీరు Xiaomi క్లౌడ్ సేవలను వినియోగిస్తున్నప్పుడు మెటీరియళ్లు లేడా డేటాను సింక్ చేయవచ్చు; మీరు ఖాతాను రూపొందించేటప్పుడు మీ లింగం, భద్రత సంబంధిత సమాచారం, ఇతర సమాచారం అందించవచ్చు; మీరు ప్రచార కార్యక్రమాలలో పాలుపంచుకుంటుంటే మీ ముద్దుపేరు, ఇమెయిల్ చిరునామా, ఫోటోలు, వీడియోలు లేదా ఇతర ఆవశ్యక సమాచారాన్ని అందించవచ్చు; మీరు మాతో, మా కంటెంట్‌తో లేదా మా మార్కెటింగ్ బృందంతో ఎంగేజ్ అవుతున్నప్పుడు లేదా బహుమతి గెలుచుకున్నప్పుడు మీ పేరు, మొబైల్ ఫోన్ నంబర్, చిరునామా వివరాలు అందించవచ్చు.

1.1.2 మీరు మా సేవలను పొందుతున్నప్పుడు మేము సేకరించే మీ సమాచారం

• పరికరం లేదా SIM సంబంధిత సమాచారం. ఉదాహరణకు, IMEI/OAID నంబర్, GAID నంబర్, IMSI నంబర్, MAC చిరునామా, సీరియల్ నంబర్, సిస్టమ్ వెర్షన్ మరియు రకం, ROM వెర్షన్, Android వెర్షన్, Android ID, స్పేస్ ID, SIM కార్డ్ ఆపరేటర్ మరియు దాని స్థాన ప్రదేశం, స్క్రీన్ డిస్‌ప్లే సమాచారం, పరికర కీప్యాడ్ సమాచారం, పరికర తయారీదారు వివరాలు మరియు మోడల్ పేరు, పరికరం యాక్టివేషన్ సమయం, నెట్‌వర్క్ ఆపరేటర్, కనెక్షన్ రకం, ప్రాథమిక హార్డ్‌వేర్ సమాచారం, అమ్మకాల ఛానెల్ మరియు వినియోగ సమాచారం (CPU, నిల్వ, బ్యాటరీ వినియోగం, స్క్రీన్ రిజల్యూషన్ మరియు పరికర ఉష్ణోగ్రత, కెమెరా లెన్స్ మోడల్, ఎన్ని సార్లు స్క్రీన్ మేల్కొల్ప బడింది మరియు అన్‌లాక్ చేయబడింది లాంటి వివరాలు).

• మూడవ పక్షం సేవా ప్రదాతలు మరియు మా వ్యాపార భాగస్వాముల ద్వారా మీకు సంబంధించి ఇవ్వబడే నిర్దిష్ట సమాచారం: మూడవ పక్షం సేవా ప్రదాతలు మరియు వ్యాపార భాగస్వాముల ద్వారా అందించబడే మీ ప్రకటనకర్త ID వంటి సమాచారాన్ని మేము సేకరించవచ్చు మరియు ఉపయోగించవచ్చు.

• మీ అప్లికేషన్ వినియోగానికి సంబంధించిన సమాచారం, ఇందులో అప్లికేషన్ కోసం విశిష్ట ఐడెంటిఫైయర్‌లు (ఉదా. VAID, OAID, AAID నంబర్, సందర్భం ID), అప్లికేషన్ ప్రాథమిక సమాచారం, అంటే అప్లికేషన్ జాబితా, అప్లికేషన్ ID సమాచారం, SDK వెర్షన్, సిస్టమ్ అప్‌డేట్ సెట్టింగ్‌లు, అప్లికేషన్ సెట్టింగ్‌లు (ప్రాంతం, భాష, సమయ మండలి, ఫాంట్), ముందు భాగలో అప్లికేషన్ ప్రవేశించే/నిష్క్రమించే సమయం మరియు అప్లికేషన్ స్టేటస్ రికార్డ్ (ఉదా. డౌన్‌లోడ్ చేయడం, ఇన్‌స్టాల్ చేయడం, అప్‌డేట్ చేయడం, తొలగించడం).

• మీరు Xiaom సిస్టమ్ సేవను ఉపయోగిస్తున్నప్పుడు రూపొందించే సమాచారం, అంటే, మీ బ్యాడ్జ్‌లు, రేటింగ్‌లు, సైన్ ఇన్ సమాచారం మరియు Xiaom కమ్యూనిటీలోని బ్రౌజింగ్ రికార్డ్‌లు; Xiaom కమ్యూనిటీలోని మీ సందేశాలు (కేవలం పంపుతున్న మరియు స్వీకరిస్తున్న వారికి మాత్రమే కనిపిస్తుంది); సంగీత సేవలలోని మీ ఆడియో ప్లేబ్యాక్ చరిత్ర మరియు శోధన ప్రశ్నలు; మీ లైక్‌లు, వ్యాఖ్యలు, ఇష్టాంశాలు, షేర్‌లు, థీమ్‌ల సేవలలోని శోధన ప్రశ్నలు; సిస్టమ్ భాష, దేశం మరియు ప్రాంతం, నెట్‌వర్క్ స్థితి, యాప్ వాల్ట్‌లోని యాప్‌ల జాబితా; మీ వినియోగ సమాచారం, దాంతో పాటు ప్రాంతం, IP, సంబంధిత కంటెంట్ ప్రొవైడర్, వాల్‌పేపర్ మారే ఫ్రీక్వెన్సీ, చిత్ర వీక్షణలు, చిత్ర బ్రౌజింగ్ మోడ్, చిత్ర బ్రౌజింగ్ వ్యవధి, కథనాల క్లిక్‌లు మరియు ఎక్స్‌పోజర్ మరియు వాల్‌పేపర్ కేరసెల్‌లో సబ్‌స్క్రిప్షన్‌లు.

• ప్రదేశ సమాచారం (నిర్దిష్ట సేవలు/ఫీచర్‌లకు మాత్రమే): మీరు (నావిగేషన్, వాతావరణం, పరికరాన్ని కనుగొను వంటి) ప్రదేశ సంబంధిత సేవలను ఉపయోగిస్తున్నట్లయితే మీ ఖచ్చితమైన లేదా సమీప ప్రాంతానికి చెందిన వివిధ రకాలైన సమాచారం. ఈ సమాచారంలో ప్రాంతం, దేశం కోడ్, నగరం కోడ్, మొబైల్ నెట్‌వర్క్ కోడ్, మొబైల్ దేశం కోడ్, సెల్ గుర్తింపు, రేఖాంశం మరియు అక్షాంశం సమాచారం, సమయ మండలి సెట్టింగ్‌లు మరియు భాష సెట్టింగ్‌లు ఉండవచ్చు. మీరు సెట్టింగ్‌లు > అప్లికేషన్‌లు > అనుమతులు > అనుమతులు > స్థానంలో ఏ సమయంలోనైనా స్థాన సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి ఒక్కొక్క అప్లికేషన్‌ను పరిమితం చేయవచ్చు.

• లాగ్ సమాచారం: నిర్దిష్ట ఫంక్షన్‌లు, యాప్‌లు మరియు వెబ్‌సైట్‌ల యొక్క మీ వినియోగానికి సంబంధించిన సమాచారం. దీనిలో కుక్కీలు మరియు ఇతర ఐడెంటిఫైయర్ సాంకేతికతలు, IP చిరునామాలు, నెట్‌వర్క్ అభ్యర్థన సమాచారం, తాత్కాలిక సందేశ చరిత్ర, ప్రామాణిక సిస్టమ్ లాగ్‌లు, క్రాష్ సమాచారం, సేవలను ఉపయోగించడం ద్వారా పొందిన (రిజిస్ట్రేషన్ సమయం, ప్రవేశ సమయం, కార్యకలాప సమయం వంటి) లాగ్ సమాచారం ఉండవచ్చు.

• ఇతర సమాచారం: పరిసర లక్షణాల విలువ (ECV) (అంటే, Xiaomi ఖాతా ID, ఫోన్ పరికర ID, కనెక్ట్ చేయబడిన Wi-Fi ID మరియు ప్రదేశ విలువ వంటి వాటి ద్వారా ఉత్పాదించబడిన విలువ).

1.1.3 మూడవ-పక్ష వనరుల నుండి సమాచారం

చట్టం ద్వారా అనుమతించబడినప్పుడు మేము మూడవ పక్ష వనరుల నుండి మీకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తాము. ఉదాహరణకు:

• ఖాతా మరియు ఆర్థికపరమైన లావాదేవీలను కలిగి ఉండే అవకాశం ఉన్న నిర్దిష్ట సేవల కోసం, మీ అనుమతితో, మీరు అందజేసిన (ఫోన్ నంబర్ వంటి) సమాచారాన్ని భద్రత మరియు మోస నివారణ ప్రయోజనాల కోసం చట్టబద్ధమైన మూడవ పక్ష వనరుల ద్వారా మేము ధృవీకరించవచ్చు;

• అడ్వర్టైజింగ్ మోడల్ ఆప్టిమైజేషన్ అనేది నిర్దేశించిన ప్రత్యేక ఐడెంటిఫైయర్‌లతో (అడ్వర్టైజర్ నుండి పొందిన IMEI/OAID/GAID వంటివి) మరియు నిర్దిష్ట సందర్భాల్లో, మీ అడ్వర్టైజింగ్ సేవల వినియోగానికి సంబంధించి పాక్షిక మార్పిడి పనితీరు డేటా (క్లిక్‌లు వంటివి) కూడా అడ్వర్టైజింగ్ సేవలను అందించడానికి ఉపయోగించబడుతుంది.

• మేము మూడవ పక్షం సామాజిక నెట్‌వర్క్ సేవల నుండి (ఉదా. మీరు Xiaomi సేవకు సైన్ ఇన్ చేయడానికి సామాజిక నెట్‌వర్క్ ఖాతాను ఉపయోగించినప్పుడు) ఖాతా ID, ముద్దు పేరు, ప్రొఫైల్ ఫోటో మరియు ఇమెయిల్ చిరునామా వంటి నిర్దిష్ట వివరాలను కూడా పొందవచ్చు.

• మీ గురించి మాకు ఇతరులు అందజేసిన సమాచారం, అంటే ఇతర వినియోగదారులు ఎవరైనా మీ కోసం mi.com సేవల ద్వారా ఏవైనా ఉత్పత్తులను కొనుగోలు చేసినప్పుడు వారు అందజేసేటటువంటి మీ డెలివరీ చిరునామా వంటివి.

1.1.4 గుర్తించలేని సమాచారం

వర్తించే స్థానిక చట్టాల ప్రకారం వ్యక్తిగత సమాచారంగా నిర్వచింపబడే అవకాశం లేనటువంటి మరియు ఎవరైనా వ్యక్తికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ లింక్ చేయబడిన ఇతర రకాల సమాచారాన్ని కూడా మేము సేకరించవచ్చు. ఆ విధమైన సమాచారం వ్యక్తిగతేతర గుర్తింపు సమాచారంగా పిలువబడుతుంది. మేము వ్యక్తిగతేతర గుర్తింపు సమాచారాన్ని సేకరించవచ్చు, వినియోగించవచ్చు, బదిలీ చేయవచ్చు మరియు వెల్లడించవచ్చు. మేము సేకరించే సమాచారం, అలాగే దాన్ని వ్యక్తిగతేతరమైనదిగా గుర్తించే సమగ్ర విధానంలో ఎలా ఉపయోగిస్తామనే దానికి కొన్ని ఉదాహరణలు ఇక్కడ అందించాము:

• ఈ సమాచారంలో మీరు నిర్దిష్ట సేవ (ఉదా. గుర్తించలేని పరికరం సంబంధిత సమాచారం, దైనందిన వినియోగం, పేజీ సందర్శనలు, పేజీ యాక్సెస్ వ్యవధి మరియు సెషన్ ఈవెంట్స్) ఉపయోగించినప్పుడు రూపొందించబడే గణాంక డేటాను చేర్చవచ్చు;

• నెట్‌వర్క్ పర్యవేక్షణ డేటా (ఉదా. అభ్యర్థన సమయం, అభ్యర్థన సంఖ్యలు లేదా లోపం అభ్యర్థనలు మొదలైనవి);

• అప్లికేషన్ క్రాష్ ఈవెంట్స్ (ఉదా. అప్లికేషన్ క్రాష్‌ల తర్వాత లాగ్‌లు స్వయంచాలకంగా రూపొందించబడతాయి).

మేము మీకు అందించే సేవలను మెరుగుపరిచేందుకే ఆ విధమైన సమాచారం సేకరించబడుతుంది. సేకరించబడేటటువంటి సమాచారం రకం మరియు పరిమాణం మీరు మా ఉత్పత్తులు మరియు/లేదా సేవలను ఎలా ఉపయోగిస్తారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది.

మీకు మరింత ఉపయోగకరమైన సమాచారాన్ని అందించడానికి, మా వెబ్‌సైట్‌లు, ఉత్పత్తులు మరియు సేవలలోని ఏ విభాగాలపై మీరు ఎక్కువగా ఆసక్తి కలిగి ఉన్నారు వంటి విషయాలు అర్థం చేసుకోవడానికి మేము ఆ సమాచారాన్ని సమగ్రపరుస్తాము. ఉదాహరణకు, ఒక రోజులో ఎంత మంది వినియోగదారులు యాక్టివ్‌గా ఉన్నారనే సంఖ్య మాత్రమే మాకు అవసరం కావచ్చు, కాని ఆ రోజులో ఎవరు యాక్టివ్‌గా ఉన్నారనే విషయం మాకు అవసరం ఉండదు మరియు గణాంక విశ్లేషణ కోసం సమగ్ర రూపంలోని డేటా సరిపోతుంది. మీ వ్యక్తిగత డేటాను వ్యక్తిగతేకర గుర్తింపు సమాచారం నుండి వేరుపరచడానికి మేము ప్రయత్నిస్తాము, అలాగే రెండు రకాల డేటాను ఖచ్చితంగా వేరుగా ఉపయోగిస్తామని హామీ ఇస్తున్నాము. అయితే, ఒకవేళ మేము వ్యక్తిగతేతర గుర్తింపు సమాచారాన్ని వ్యక్తిగత సమాచారంతో కలిపితే, అలా కలిపిన సమాచారం అలా కలిసి ఉన్నంత కాలం వ్యక్తిగత సమాచారంగానే పరిగణించబడుతుంది.

1.2 మేము సేకరించిన వ్యక్తిగత సమాచారాన్ని మేము ఎలా ఉపయోగిస్తాము

మేము వర్తించే చట్టాలు, నియంత్రణలు మరియు ఇతర నియంత్రిత ఆవశ్యకాలకు లోబడి ఉన్నామని నిర్ధారించుకోవడానికి మరియు మీకు మా ఉత్పత్తులు మరియు/లేదా సేవలను అందజేయడానికి ఈ వ్యక్తిగత సమాచారం సేకరించబడుతుంది. ఇందులో భాగంగా:

• మీకు మా ఉత్పత్తులు మరియు/లేదా సేవలను అందజేయడం, ప్రాసెస్ చేయడం, నిర్వహించడం, మెరుగుపరచడం మరియు అభివృద్ధి పరచడం, డెలివరీ యాక్టివేషన్, ధృవీకరించడం, విక్రయానంతర మద్దతు, కస్టమర్ మద్దతు మరియు వ్యాపార ప్రకటనలను అందజేయడం వంటి వాటిని కలిగి ఉంటాయి.

• నష్టం లేదా మోసాన్ని నివారించడంలో భాగంగా భద్రతా రక్షణలను అమలు పరచడం మరియు నిర్వహించడం, వినియోగదారులను గుర్తించడం మరియు వినియోగదారు గుర్తింపుని ధృవీకరించడం వంటివి. క్రింది రెండు షరతులు సరిపోలినప్పుడు మాత్రమే మేము మీ సమాచారాన్ని మోసాన్ని నివారించే ప్రయోజనాల కోసం ఉపయోగిస్తాము: ఇది అవసరం; మరియు మూల్యాంకనం చేసేందుకు ఉపయోగించేటటువంటి డేటా వినియోగదారులను మరియు సేవలను రక్షించేందుకు Xiaomi యొక్క చట్టబద్ధమైన ఆసక్తులకు లోబడి ఉంటుంది.

• పరికరాలు మరియు సేవల గురించి మీ ప్రశ్నలు లేదా అభ్యర్థనలను నిర్వహించడం, అంటే, కస్టమర్ విచారణలకు జవాబివ్వడం, సిస్టమ్ మరియు అప్లికేషన్ నోటిఫికేషన్‌లను పంపడం మరియు ఈవెంట్స్ మరియు ప్రమోషన్‌ల్లో మీ ప్రమేయాన్ని నిర్వహించడం (ఉదా. పందెములు).

• సందర్భోచిత ప్రచార కార్యక్రమాలను నిర్వహించడం, అంటే మార్కెటింగ్ మరియు ప్రచార సంబంధిత మెటీరియళ్లు మరియు అప్‌డేట్‌లను అందించడం లాంటివి. నిర్దిష్ట రకాల ప్రచార మెటీరియళ్లు మీకు ఇకపై వద్దనుకునే పక్షంలో, వర్తించే చట్టాల ప్రకారం పేర్కొని ఉంటే మినహా సందేశంలో అందించిన విధానం ద్వారా నిలిపివేయవచ్చు (సందేశం దిగువ ఉండే అన్‌సబ్‌స్క్రైబ్ లింక్ లాంటివి). దయచేసి దిగువన ఉన్న "మీ హక్కులు" కూడా చూడండి.

• అంతర్గత ప్రయోజనాలు, ఉదా. మా ఉత్పత్తులు లేదా సేవలను మరింత మెరుగుపరిచేందుకు ఉపయోగించే డేటా విశ్లేషణ, పరిశోధన మరియు మా ఉత్పత్తులు లేదా సేవల వినియోగానికి సంబంధించిన గణాంక సమాచారం అభివృద్ధి లాంటివి. ఉదాహరణకు, గుర్తింపుని తీసివేసే ప్రక్రియ పూర్తి చేయబడిన తర్వాత మెషీన్ అభ్యసనం లేదా మోడల్ అల్గారిథమ్ ట్రైనింగ్ వంటివి నిర్వహించబడతాయి.

• మీ పరికరం పనితీరును ఆప్టిమైజ్ చేయడం, ఉదా., మెమరీ వినియోగం విశ్లేషించడం లేదా మీ అప్లికేషన్‌ యొక్క CPU వినియోగం.

• మా వ్యాపార కార్యకలాపాల కోసం మీకు సంబంధించిన సమాచారాన్ని నిల్వ చేయడం మరియు నిర్వహించడం (వ్యాపార గణాంకాలు లాంటివి) లేదా మా చట్టపరమైన బాధ్యతలను నెరవేర్చడం లాంటివి.

• Xiaomi చట్టబద్ధమైన ప్రయోజనాల ఆధారంగా ప్రాసెసింగ్ చేయడం (సంబంధిత జురిస్డిక్షన్‌లలో, ఉదాహరణకు GDPR ప్రకారం). చట్టబద్ధమైన ప్రయోజనాలలో భాగంగా మా వ్యాపారం, మా ప్రోడక్ట్‌లు మరియు సేవలను మరింత సమర్థవంతంగా నిర్వహించడం మరియు సాగించడం; మా వ్యాపారాలు, సిస్టమ్‌లు, ప్రోడక్ట్‌లు, సేవలు మరియు కస్టమర్‌ల భద్రతను కాపాడటం (మోసాల నివారణ మరియు యాంటీ-ఫ్రాడ్ ప్రయోజనాలతో సహా); అంతర్గత నిర్వహణ; అంతర్గత విధానాలు మరియు ప్రాసెస్‌లకు అనుగుణంగా ఉండటం; అలాగే ఈ పాలసీలో వివరించిన ఇతర చట్టబద్ధమైన ప్రయోజనాలు.

ఉదాహరణకు, మా సేవల భద్రతను నిర్ధారించడానికి మరియు మా అప్లికేషన్‌ల పనితీరును మరింతగా అర్థం చేసుకోవడానికి, మేము మీ వినియోగ ఫ్రీక్వెన్సీ, క్రాష్ లాగ్ సమాచారం, మొత్తం వినియోగం, పనితీరు డేటా మరియు అప్లికేషన్ సోర్స్ వంటి సంబంధిత సమాచారాన్ని రికార్డ్ చేయవచ్చు. పరికరాలను అన్‌లాక్ చేయకుండా అనధికార విక్రేతలను నివారించడానికి, మేము ఆపరేట్ చేసిన కంప్యూటర్ యొక్క Xiaomi ఖాతా ID, క్రమ సంఖ్య మరియు IP చిరునామా మరియు మీ మొబైల్ పరికరం యొక్క క్రమ సంఖ్య మరియు పరికర సమాచారాన్ని సేకరించవచ్చు.

• స్థానికంగా టెర్మినల్ పరికరాలలో సేవలను అందించడం మా సర్వర్‌లతో కమ్యూనికేషన్ అవసరం లేనటువంటివి, ఉదా., మీ పరికరంలో గమనికలను ఉపయోగించడం లాంటివి.

• మీ సమ్మతితో ఇతర ప్రయోజనాలు.

మేము మీ సమాచారాన్ని ఏ విధంగా ఉపయోగిస్తామనే దాని గురించి ఇక్కడ కొన్ని వివరణాత్మక ఉదాహరణలతో అందిస్తున్నాము (ఇందులో వ్యక్తిగత సమాచారం కూడా చేర్చవచ్చు):

• మీరు కొనుగోలు చేసిన Xiaomi ఉత్పత్తులు లేదా మీ సేవలను యాక్టివేట్ చేయడం మరియు రిజిస్టర్ చేయడం.

• మీ Xiaomi ఖాతాను సృష్టించడం మరియు నిర్వహించడం. మీరు మా వెబ్‌సైట్‌లలో లేదా మా మొబైల్ పరికరాల ద్వారా Xiaomi ఖాతాను సృష్టించినప్పుడు సేకరించబడే వ్యక్తిగత సమాచారం వ్యక్తిగత Xiaomi ఖాతాను మరియు మీ కోసం ప్రొఫైల్ పేజీని సృష్టించడానికి ఉపయోగించబడుతుంది.

• మీ కొనుగోలు ఆర్డర్‌ను ప్రాసెస్ చేయడం. ఇ-కామర్స్ ఆర్డర్‌లకు సంబంధించిన సమాచారం కొనుగోలు ఆర్డర్ ప్రాసెస్ చేయడానికి మరియు సంబందిత విక్రయాల అనంతర సేవలు, దానితో కస్టమర్ మద్దతు మరియు పునఃబట్వాడా కోసం ఉపయోగించవచ్చు. వాటితోపాటు, డెలివరీ పార్ట్‌నర్‌తో ఆర్డర్ గురించి విచారించడానికి మరియు పార్సిల్ సరిగ్గా ఎప్పుడు డెలివరీ చేయబడుతుందో తెలుసుకోవడానికి ఆర్డర్ నంబర్ ఉపయోగించబడుతుంది. డెలివరీ ప్రయోజనాల కోసం స్వీకర్త సమాచారం అంటే పేరు, చిరునామా, ఫోన్ నంబర్ మరియు పోస్టల్ కోడ్ వంటివి ఉపయోగించబడతాయి. పార్సిల్ ట్రాకింగ్ సమాచారాన్ని మీకు పంపేందుకు మీ ఇమెయిల్ చిరునామా ఉపయోగించబడుతుంది. కొనుగోలు చేసిన వస్తువుల జాబితా ఇన్వాయిస్‌ను ముద్రించడానికి ఉపయోగించబడుతుంది మరియు పార్శిల్‌లో ఏ వస్తువులు ఉన్నాయో చూసేందుకు కస్టమర్‌ను అనుమతిస్తుంది.

• Xiaomi Communityలో పాల్గొనడం. ప్రొఫైల్ పేజీని ప్రదర్శన, ఇతర వినియోగదారులతో ఇంటరాక్షన్ మరియు Xiaomi Communityలో పాల్గొనడం కోసం Xiaomi Community లేదా ఇతర Xiaomi ఇంటర్నెట్ ప్లాట్‌ఫామ్‌లకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని ఉపయోగించవచ్చు.

• సిస్టమ్ సేవలను అందించడం. సిస్టమ్ సేవలను యాక్టివేట్ చేయడానికి కింది సమాచారం ఉపయోగించబడవచ్చు: పరికరం లేదా SIM కార్డ్ సంబంధిత సమాచారం, అంటే GAID నంబర్, IMEI నంబర్, IMSI నంబర్, ఫోన్ నంబర్, పరికర ID, పరికర ఆపరేటింగ్ సిస్టమ్, MAC చిరునామా, పరికర రకం, సిస్టమ్ మరియు పనితీరు సమాచారం మరియు మొబైల్ దేశం కోడ్, మొబైల్ నెట్‌వర్క్ కోడ్, లొకేషన్ ఏరియా కోడ్ మరియు కాల్ గుర్తింపు మొదలైనవి.

• యాక్టివేషన్ వైఫల్యాలను విశ్లేషించడం. సిమ్ కార్డ్ యాక్టివేషన్ వైఫల్యానికి ప్రవేశం పొందేందుకు (ఉదా. చిన్న సందేశ సేవ (SMS) గేట్‌వేలు మరియు నెట్‌వర్క్ వైఫల్యాలు) సేవ యొక్క నెట్‌వర్క్ ఆపరేటర్‌ను గుర్తించడానికి మరియు ఆ వైఫల్యాన్ని నెట్‌వర్క్ ఆపరేటర్‌కు తెలియజేయడం కోసం ప్రదేశ సంబంధ సమాచారం ఉపయోగించబడుతుంది.

• ఇతర సిస్టమ్ సేవలు అందించడం. సేవ ఆప్టిమైజేషన్‌ను అందిస్తున్నప్పుడు ఆ సేవ విధులను నిర్వహించడానికి Xiaomi సిస్టమ్ సేవని ఉపయోగిస్తున్నప్పుడు సేకరించిన సమాచారం ఉపయోగించబడుతుంది, ఉదా. డౌన్‌లోడ్ చేయడం, అప్‌డేట్ చేయడం, నమోదు చేయడం, అమలు చేయడం లేదా సిస్టమ్ సేవలకు సంబంధించిన కార్యకలాపాలను ఆప్టిమైజ్ చేయడం. ఉదాహరణకు, థీమ్స్ స్టోర్ ద్వారా సేకరించిన వ్యక్తిగత సమాచారం మీ డౌన్‌లోడ్ మరియు బ్రౌజింగ్ చరిత్ర ఆధారంగా వ్యక్తిగతీకరించిన థీమ్ సిఫార్సు సేవలను అందించవచ్చు.

• మీ పరికరాన్ని గుర్తించడం. మీరు మీ పరికరాన్ని పోగొట్టుకుంటే లేదా దొంగిలించబడితే, Xiaomi యొక్క పరికరాన్ని కనుగొను ఫీచర్ దానిని కనుగొనడంలో మరియు భద్రపరచడంలో మీకు సహాయపడుతుంది. మీరు మీ పరికరం స్థాన సమాచారాన్ని ఉపయోగించి మ్యాప్‌లో దానిని గుర్తించవచ్చు, డేటా రిమోట్‌గా ఎరేజ్ చేయవచ్చు లేదా పరికరాన్ని లాక్ చేయవచ్చు. మీరు పరికరాన్ని కనుగొను సేవ ఫీచర్‌ను ఉపయోగిస్తున్నప్పుడు, పరికరం నుంచి స్థానం సమాచారం క్యాప్చర్ చేయబడుతుంది; కొన్ని సందర్భాలలో, ఈ సమాచారం సెల్ టవర్‌లు లేదా Wi-Fi హాట్‌స్పాట్‌ల నుంచి గ్రహించబడుతుంది. మీరు ఏ సమయంలోనైనా సెట్టింగ్‌లు > Xiaomi ఖాతా > Xiaomi క్లౌడ్ > పరికరాన్ని కనుగొనులో ఈ ఫీచర్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయవచ్చు.

• ఫోటోలలో ప్రదేశ సమాచారాన్ని రికార్డ్ చేయడం. మీరు ఫోటో తీస్తున్నప్పుడు మీ ప్రదేశ సమాచారాన్ని రికార్డ్ చేయవచ్చు. ఈ సమాచారం మీ ఫోటో ఫోల్డర్‌లో కనిపిస్తుంది మరియు ప్రదేశం మీ ఫోటోల స్థితి సమాచారంలో సేవ్ చేయబడుతుంది. ఫోటో తీస్తున్నప్పుడు మీ ప్రదేశం రికార్డ్ చేయడం మీకు ఇష్టం లేకుంటే, మీరు దీనిని ఎప్పుడైనా పరికరం యొక్క కెమెరా సెట్టింగ్‌లలో ఆఫ్ చేయవచ్చు.

• సందేశ సేవ ఫీచర్‌లను అందించడం (ఉదా. Mi టాక్, Mi మెసేజ్). మీరు Mi టాక్‌ను డౌన్‌లోడ్ చేసి, ఉపయోగిస్తే, Mi టాక్ సేకరించిన సమాచారం ఈ సేవను యాక్టివేట్ చేయడానికి మరియు వినియోగదారు మరియు సందేశ స్వీకర్తను గుర్తించడానికి ఉపయోగించబడవచ్చు. అదనంగా, వినియోగదారు అప్లికేషన్‌ను తిరిగి ఇన్‌స్టాల్ చేసుకున్నప్పుడు మరియు పరికరాల అంతటా సమకాలీకరించాల్సినప్పుడు చాట్ చరిత్రను రీలోడ్ చేసే సౌకర్యం కల్పించడానికి చాట్ చరిత్ర నిల్వ చేయబడుతుంది. సేవను యాక్టివేట్ చేయడానికి మరియు సందేశాలను రూట్ చేయడంతోపాటు దాని ప్రాథమిక ఫంక్షనాలిటీని ప్రారంభించడానికి Mi సందేశ సేవ కోసం పంపినవారి మరియు స్వీకరించినవారి ఫోన్ నంబర్‌లు మరియు Mi సందేశ సేవ IDలు వంటి సమాచారం ఉపయోగించవచ్చు.

• ప్రదేశ-ఆధారిత సేవలను అందించడం. Xiaomi సిస్టమ్ సేవలను ఉపయోగించడంలో భాగంగా, మీకు సేవను అందించడానికి మరియు వాతావరణ వివరాలు, ప్రదేశ ప్రవేశానుమతి Android ప్లాట్‌ఫామ్‌లో భాగంగా వంటి ఉత్తమ వినియోగదారు అనుభవం అందించడం కోసం ప్రదేశం గురించి (వాతావరణం వివరాలు వంటివి) ఖచ్చితమైన వివరాలు అందించడానికి ప్రదేశ సమాచారాన్ని మేము లేదా మూడవ పక్ష సేవా ప్రదాతలు మరియు వ్యాపార భాగస్వాములు (మరింత సమాచారం కోసం దిగువన "మేము మీ వ్యక్తిగత సమాచారాన్ని ఎలా పంచుకుంటాము, బదిలీ చేస్తాము మరియు పబ్లిక్‌గా వెల్లడిస్తాము" చూడండి) ఉపయోగించవచ్చు. మీరు సెట్టింగ్‌లలో ప్రదేశ సేవలను ఆఫ్ చేయవచ్చు లేదా ఒక్కొక్క యాప్‌లో ఎప్పుడైనా ప్రదేశ సేవల వినియోగాన్ని ఆఫ్ చేయవచ్చు.

• డేటా, హార్డ్‌వేర్ మరియు సాఫ్ట్‌వేర్ విశ్లేషణ ద్వారా వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరచడం. కొన్ని ఎంచుకోగలిగే ఫీచర్‌లు అంటే వినియోగదారు అనుభవ ప్రోగ్రామ్ వంటి వాటి ద్వారా వినియోగదారులు మొబైల్ ఫోన్ మరియు Xiaomi సిస్టమ్ సేవలు మరియు Xiaomi అందించే ఇతర సేవలు ఎలా ఉపయోగిస్తున్నారనే డేటాను Xiaomi విశ్లేషించగలుగుతుంది, తద్వారా క్రాష్ నివేదికలను పంపడం ద్వారా వినియోగదారు అనుభవం మెరుగుపరచగలుగుతుంది. వినియోగదారు అనుభవాన్ని మరింత మెరుగుపరచడానికి Xiaomi హార్డ్‌వేర్ మరియు సాఫ్ట్‌వేర్ విశ్లేషణ కూడా చేస్తుంది.

• భద్రతా ఫీచర్‌ను అందించడం. సేకరించిన సమాచారం భద్రతా స్కాన్, బ్యాటరీ సేవర్, నిరోధిత జాబితా, క్లీనర్ మొదలైనటువంటి భద్రతా యాప్‌లలో భద్రతను మరియు సిస్టమ్ ఆధునికంగా ఉంచే నిర్వహణల కోసం ఉపయోగించబడవచ్చు. ఈ ఫీచర్‌ల్లో కొన్ని మూడవ పక్ష సేవా ప్రదాతలు మరియు/లేదా మా వ్యాపార భాగస్వామలచే నిర్వహించబడతాయి (మరింత సమాచారం కోసం దిగువన "మేము మీ వ్యక్తిగత సమాచారాన్ని మేము ఎలా పంచుకుంటాము, బదిలీ చేస్తాము మరియు పబ్లిక్‌గా బహిర్గత పరుస్తాము" చూడండి). భద్రతా స్కాన్ ఫంక్షన్‌ల కోసం వైరస్ నిర్వచన జాబితాల వంటి వ్యక్తిగత సమాచారం కాని సమాచారం ఉపయోగించబడుతుంది.

• పుష్ సేవను అందించడం. ప్రకటనల ప్రదర్శన అంచనా వేయడానికి మరియు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు లేదా కొత్త ఉత్పత్తి ప్రకటనల గురించి సమాచారం పంపడం, దానితో పాటు విక్రయాలు మరియు ప్రచారాల గురించి సిస్టమ్ నుండి నోటిఫికేషన్‌లను పంపడానికి Xiaomi పుష్ మరియు నోటిఫికేషన్ సేవలను అందించేందుకు కూడా Xiaomi ఖాతా ID, GAID, FCM టోకెన్, Android ID మరియు స్పేస్ ID (కేవలం రెండవ స్పేస్ ఫీచర్ ఆన్ చేసిన Xiaomi పరికరాలలో మాత్రమే) ఉపయోగించబడతాయి. పైన ఉన్న సేవను మీకు అందించడానికి, సంబంధిత అప్లికేషన్ సమాచారం (యాప్ వెర్షన్ ID, యాప్ ప్యాకేజీ పేరు) మరియు సంబంధిత పరికర సమాచారం (మోడల్, బ్రాండ్) కూడా సేకరించబడతాయి. మా ఉత్పత్తులు మరియు సేవలు మరియు/లేదా ఎంచుకున్న మూడవ పక్షాల ఉత్పత్తులు మరియు సేవలను ఆఫర్ చేసే లేదా ప్రచారం చేసే పుష్ సందేశాలను (మా సేవల్లో సందేశాలు పంపుకోవడం లేదా ఇమెయిల్ లేదా ఇతర మార్గాల్లో పంపడం) మీకు పంపడం కోసం మేము మీ వ్యక్తిగత సమాచారాన్ని ఉపయోగించవచ్చు. ఇది వర్తించే చట్టాల ప్రకారం కేవలం మీ సమ్మతిపై మాత్రమే జరుగుతుంది. మీరు పరికరం సెట్టింగ్‌లలో మీ ప్రాధాన్యతలను మార్చడం లేదా Xiaomi పుష్‌ను ఉపయోగించి మూడవ పక్ష యాప్/వెబ్‌సైట్ ద్వారా మీ ప్రాధాన్యతలను నిర్వహించడం ద్వారా ఎప్పుడైనా మా నుండి మరియు మూడవ పక్షాల నుండి మార్కెటింగ్ సమాచారం స్వీకరించకుండా నిలిపివేయవచ్చు. దయచేసి దిగువన ఉన్న "మీ హక్కులు" కూడా చూడండి.

• వినియోగదారు గుర్తింపును ధృవీకరించడం. వినియోగదారు గుర్తింపును ధృవీకరించడానికి మరియు అనధికారిక సైన్ ఇన్‌లను నివారించడానికి Xiaomi ECV విలువను ఉపయోగిస్తుంది.

• వినియోగదారు అభిప్రాయాన్ని సేకరించడం. మీరు అందించడానికి ఎంచుకున్న అభిప్రాయం ఎంతో విలువైనది మరియు మా సేవలకు మెరుగుదలలు చేయడానికి Xiaomiకి సహాయపడుతుంది. మీరు అందించడానికి ఎంచుకున్న అభిప్రాయం గురించి మీకు గుర్తు చేయడానికి, Xiaomi సమస్యను పరిష్కరించడానికి మరియు సేవను మెరుగుపరచడం కోసం దీనికి సంబంధించి మీరు అందించిన మరియు రికార్డ్‌లలో కలిగి ఉన్న వ్యక్తిగత సమాచారం ఉపయోగించి మిమ్మల్ని సంప్రదించవచ్చు.

• నోటీసులను పంపడం. కాలానుగుణంగా, మేము మీ వ్యక్తిగత సమాచారాన్ని ఉపయోగించి ముఖ్యమైన నోటీసులను పంపవచ్చు, ఉదాహరణకు కొనుగోళ్ల గురించి నోటీసులు మరియు మా నిబంధనలు, షరతులు మరియు విధానాలకు చేసే మార్పులు వంటివి. Xiaomiకో మీ ఇంటరాక్షన్ కోసం ఇటువంటి సమాచారం చాలా కీలకం కనుక, మేము ఈ నోటీసుల స్వీకరణను అంగీకరించాలని బలంగా సిఫార్సు చేస్తున్నాము.

• ప్రచార కార్యకలాపాలను నిర్వహించడం. మీరు పందెం, పోటీ లేదా ఆ రకమైన ప్రచారంలో లేదా Xiaomi యొక్క సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా అటువంటి ప్రచారంలో పాల్గొంటే, మీకు బహుమతులను పంపడానికి మేము మీరు అందించే వ్యక్తిగత సమాచారాన్ని మేము ఉపయోగించవచ్చు.

• వ్యక్తిగతీకరించిన సేవలు మరియు కంటెంట్, అలాగే ప్రకటనలు అందించడం. మీ గోప్యతను కాపాడుతూనే, మీకు వ్యక్తిగతీకరించిన ప్రోడక్ట్‌లు, సేవలు మరియు కార్యకలాపాలు, దాంతో వ్యాపార ప్రకటనలు అందించడానికి మీ పేరు, ఇమెయిల్ లేదా మిమ్మల్ని ప్రత్యక్షంగా గుర్తించగలిగే ఇతర సమాచారం కాకుండా విశిష్ట ఐడెంటిఫైయర్‌ను ఉపయోగిస్తాము.

మా ఉత్పత్తులు, సేవలు, కంటెంట్ మరియు వ్యాపార ప్రకటనలను అందజేయడంతోపాటు మెరుగులు దిద్దేందుకు మేము ఈ సమాచారాన్ని (కంప్యూటర్‌లు, మొబైల్ ఫోన్‌లు, స్మార్ట్ TVలు మరియు ఇతర కనెక్ట్ చేయబడిన పరికరాలు వంటి వివిధ సేవలు లేదా పరికరాలలోని) ఇతర సమాచారంతో కలపవచ్చు.

ఉదాహరణకు, మేము మీ Xiaomi ఖాతా వివరాలను మీరు ఆ Xiaomi ఖాతాను ఉపయోగించే అన్ని సేవలలోనూ ఉపయోగించవచ్చు. ఆపై, సంబంధిత చట్టాలు మరియు నియమనిబంధనలు పాటిస్తూనే (అవసరమైన సందర్భాలలో) మీ సమ్మతి తీసుకోవడం ద్వారా మీకు ఉత్తమ అనుభవాన్ని అందించడానికి మరియు మా సేవలను మెరుగుపరిచే క్రమంలో లేబుల్‌ని రూపొందించడానికి, సూచనలు, తగినట్లుగా మార్పులు చేసిన కంటెంట్ మరియు వ్యక్తిగతీకరించిన ఫీచర్‌లను అందించడానికి, మీ నుండి లేదా మీకు చెందిన వారి నుండి వేర్వేరు ఉత్పత్తులు, సేవలు లేదా సామగ్రికి సంబంధించిన సమాచారాన్ని మేము క్రమీకరించవచ్చు.

ఉదాహరణకు మీ కార్యకలాపాలు, వినియోగం మరియు మా యాప్‌లు మరియు సేవలకు సంబంధించిన ప్రాధాన్యతల ఆధారంగా వ్యక్తిగతీకరించిన ప్రకటనలను అందించవచ్చు. పైన పేర్కొన్న సమాచారాన్నివిశ్లేషించడం, వర్గీకరణలు రూపొందించడం (నిర్దిష్ట ఉమ్మడి లక్షణాలతో గ్రూప్‌లు), అదే విధంగా మీ వ్యక్తిగత సమాచారాన్ని ఒకటి లేదా మరిన్ని వర్గీకరణలలో ఉంచడం ద్వారా ప్రొఫైల్‌లను రూపొందిస్తాము. లక్షిత వ్యాపార ప్రకటనల విధానం వర్తించే చట్టాల ప్రకారం కేవలం మీ సమ్మతిపై మాత్రమే జరుగుతుంది. మీరు ఏ సమయంలోనైనా వ్యక్తిగతీకరించబడిన వ్యాపార ప్రకటనల నుండి ఎంపికను తీసివేసే హక్కుని కలిగి ఉండడంతోపాటు ప్రత్యక్ష మార్కెటింగ్ ప్రయోజనాల కోసం నిర్వహించేటటువంటి ప్రొఫైలింగ్‌కి అభ్యంతరం తెలియజేయడం వంటివి చేయవచ్చు.

పైన పేర్కొన్న వర్తించే చట్టాల కలయిక ఆధారంగా మరియు వాటి ఆవశ్యకాల ప్రకారం, మేము మీకు నిర్దిష్ట నియంత్రణ విధానాలను అటువంటి సిగ్మెంటేషన్ మరియు వ్యక్తిగతీకరణ కోసం అందిస్తాము. మా నుండి ప్రత్యక్ష మార్కెటింగ్ మరియు స్వయంచాలిత నిర్ణయాధికారం నిలిపివేసే హక్కు మాకు ఉంది. ఈ హక్కులను ఉపయోగించడానికి, మీరు సెట్టింగ్‌లు > పాస్‌వర్డ్‌లు & భద్రత > గోప్యత > ప్రకటన సేవలు లేదా సెట్టింగ్‌లు > పాస్‌వర్డ్‌లు & భద్రత > సిస్టమ్ భద్రత > ప్రకటన సేవలలో ఎప్పుడైనా ఈ ఫీచర్‌లను ఆన్ లేదా ఆఫ్ చేయవచ్చు లేదా https://privacy.mi.com/support ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు లేదా ప్రతి ప్రోడక్ట్ కోసం విడిగా ఉండే గోప్యతా విధానంలో వివరించిన నియంత్రణ విధానాలు చూడటం ద్వారా ఎప్పుడైనా ఆన్ లేదా ఆఫ్ చేయవచ్చు. దయచేసి దిగువన ఉన్న "మీ హక్కులు" కూడా చూడండి.

2. మేము కుక్కీలు మరియు ఇతర సాంకేతికతలను ఎలా ఉపయోగిస్తాము

కుక్కీలు, వెబ్ బీకాన్‌లు మరియు పిక్సెల్ ట్యాగ్‌లు వంటి సాంకేతికతలను Xiaomi మరియు మా మూడవ పక్ష సేవా ప్రదాతలు మరియు వ్యాపార భాగస్వాములు ఉపయోగిస్తారు (మరింత సమాచారం కోసం దిగువన "మీ వ్యక్తిగత సమాచారాన్ని మేము ఎలా పంచుకుంటాము, బదిలీ చేస్తాము మరియు పబ్లిక్‌గా వెల్లడిస్తాము" చూడండి). ఈ సాంకేతికతలు ట్రెండ్‌లను విశ్లేషించడం, సైట్‌ను నిర్వహించడం, వెబ్‌సైట్‌లో వినియోగదారులు వేటి పట్ల ఆసక్తి చూపుతున్నారు వంటివి ట్రాక్ చేయడం మరియు మొత్తమ్మీద మా వినియోగదారుల సమూహం యొక్క జనాభా సూచికల సమాచారాన్ని సేకరించడంలో ఉపయోగపడతాయి. అంతేకాకుండా, మేము ఈ సాంకేతికతల వినియోగానికి సంబంధించి ఈ కంపెనీల నుండి విడివిడిగానూ, అలాగే సమగ్రంగానూ నివేదికలను అందుకోవచ్చు. ఈ సాంకేతికతలు వినియోగదారుల ప్రవర్తనలను ఉత్తమంగా అర్థం చేసుకోవడంలో, వ్యక్తులు మా వెబ్‌సైట్‌లలో ఏ భాగాలను సందర్శించారో మాకు చెప్పడానికి మరియు ప్రకటనలు మరియు వెబ్ శోధనల ప్రభావాన్ని అందించడానికి మరియు గణించడానికి మాకు సహాయపడతాయి.

• లాగ్ ఫైల్‍లు: నిజం చెప్పాలంటే మేము దాదాపు అన్ని వెబ్‌సైట్‌ల నుండి నిర్దిష్ట సమాచారాన్ని సేకరించి, లాగ్ ఫైల్‌లలో భద్రపరుస్తాము. ఈ సమాచారంలో IP చిరునామా, బ్రౌజర్ రకం, ఇంటర్నెట్ సేవా ప్రదాత (ISP), సూచిస్తున్న/నిష్క్రమిస్తున్న పేజీలు, ఆపరేటింగ్ సిస్టమ్, తేదీ/సమయం ముద్ర మరియు/లేదా క్లిక్‌స్ట్రీమ్ డేటా వంటివి సేకరించవచ్చు. ఆటోమేటిక్‌గా సేకరించబడే ఈ డేటాను మేము మీ గురించి సేకరించే ఇతర సమాచారంతో కలపము.

• స్థానిక నిల్వ – HTML5/Flash: HTML5/Flash: మేము HTML5 లేదా Flash వంటి స్థానిక నిల్వ ఆబ్జెక్ట్‌లు (LSOలు) ఉపయోగించి కంటెంట్‌ను మరియు ప్రాధాన్యతలను నిల్వ చేస్తాము. మా సైట్‌లలో నిర్దిష్ట ఫీచర్‌లను అందించడానికి లేదా మీ వెబ్ బ్రౌజింగ్ కార్యకలాపం ఆధారంగా వ్యాపార ప్రకటనలను ప్రదర్శించాడనికి భాగస్వామ్యం అయ్యే మూడవ పక్షాలు HTML5 లేదా Flash కుక్కీలను ఉపయోగించి కూడా సమాచారాన్ని సేకరిస్తాయి మరియు నిల్వ చేస్తాయి. వివిధ రకాల బ్రౌజర్‌లు HTML5 LSOలు తీసివేసే నిమిత్తం వాటి స్వంత నిర్వహణ సాధనాన్ని అందించవచ్చు. మీరు మీ ఫ్లాష్ కుక్కీలను నిర్వహించడానికి ఇక్కడ క్లిక్ చేయవచ్చు.

• వాణిజ్య ప్రకటన కుక్కీలు: మేము మా వెబ్‌సైట్‌లలో ప్రకటనలను ప్రదర్శించడానికి లేదా ఇతర సైట్‌లలో మా ప్రకటనలను నిర్వహించడానికి మా మూడవ పక్ష సేవా ప్రదాతలు మరియు వ్యాపార భాగస్వాములతో (మరింత సమాచారం కోసం దిగువన “మేము మీ వ్యక్తిగత సమాచారాన్ని ఎలా పంచుకుంటాము, బదిలీ చేస్తాము మరియు వెల్లడిస్తాము” చూడండి) భాగస్వాములం అవుతాము. మా మూడవ పక్షం సర్వీస్ ప్రొవైడర్‌లు మరియు వ్యాపార భాగస్వాములు మీ ఆన్‌లైన్ కార్యకలాపాలు మరియు ఆసక్తుల గురించి సమాచారాన్ని సేకరించడానికి మరియు మీ ప్రొఫైల్, ఆసక్తులతో అత్యంత పరస్పర సంబంధితమైన ప్రకటనలను మీకు అందించడానికి వ్యాపార ప్రకటనల కుక్కీలను ఉపయోగించవచ్చు. మేము ఈ రకమైన వ్యాపార ప్రకటనల సేవను మీకు అందించడం కంటే ముందు మీ నుండి ముందస్తు సమ్మతిని మరియు స్పష్టమైన ధృవీకరణ అనుమతిని తీసుకుంటాము. ఒకవేళ ఈ సమాచారం ద్వారా మీకు ఆసక్తి ఆధారిత ప్రకటనలను అందించడం మీకు ఇష్టం లేకుంటే, మీ కుకీ సెట్టింగ్‌ను మార్చడం ద్వారా దీనిని నిలిపివేయవచ్చు.

• మొబైల్ విశ్లేషణలు: మా మొబైల్ అప్లికేషన్‌లు కొన్నింటిలో, మేము విశ్లేషణ కుక్కీలను ఉపయోగించి సందర్శకులు మా వెబ్‌సైట్‌ను ఎలా ఉపయోగిస్తారనే సమాచారం సేకరిస్తాము. ఈ కుక్కీలు మీరు అప్లికేషన్‌ను ఎంత తరచుగా ఉపయోగిస్తున్నారు, అప్లికేషన్‌లో జరిగే సంఘటనలు, సమగ్ర వినియోగం, పనితీరు డేటా మరియు అప్లికేషన్‌లో ఎక్కడెక్కడ క్రాష్‌లు సంభవిస్తున్నాయి వంటి వాటి గురించిన సమాచారాన్ని సేకరిస్తాయి. మేము విశ్లేషణల సాఫ్ట్‌వేర్‌లో నిల్వ చేసే సమాచారం దేనిని మీరు అప్లికేషన్‌లో సమర్పించే ఏ వ్యక్తిగత సమాచారంతోనూ కలపము.

3. మీ వ్యక్తిగత సమాచారాన్ని మేము ఎలా షేర్ చేస్తాము, బదిలీ చేస్తాము మరియు బహిర్గతం చేస్తాము

3.1 భాగస్వామ్యం

మేము వ్యక్తిగత సమాచారం ఏదీ మూడవ పక్షాలకు విక్రయించము.

మీ ఆవశ్యకాల ఆధారంగా ఉత్పత్తులు మరియు సేవలను అందించడంతో పాటుగా మా ఉత్పత్తులు మరియు సేవలను అందించడం లేదా మెరుగుపరిచే క్రమంలో మేము కొన్నిసార్లు మీ వ్యక్తిగత సమాచారాన్ని మూడవ పక్షాలతో (దిగువన వివరించిన విధంగా) పంచుకోవచ్చు. డేటాను పంచుకోవడానికి సంబంధించిన మరింత సమాచారం దిగువ ఉంది.

3.1.1 మీరు క్రియాశీలకంగా ఎంచుకున్న లేదా అభ్యర్థించిన వాటిని పంచుకోవడం

మీ సమ్మతితో లేదా మీ అభ్యర్థన మేరకు, మీరు మూడవ పక్ష వెబ్‌సైట్ లేదా అప్లికేషన్‌కు సైన్ ఇన్ చేయడానికి Xiaomi ఖాతాను ఉపయోగించినప్పుడు వంటి సందర్భాల్లో మీచే నిర్దేశించబడిన నిర్దిష్ట మూడవ పక్షాలతో మీ సమ్మతి/అభ్యర్థన పరిధిలోపు మీ వ్యక్తిగత సమాచారాన్ని భాగస్వామ్యం చేయవచ్చు.

3.1.2 మా సమూహంతో సమాచారాన్ని పంచుకోవడం

వ్యాపార కార్యకలాపాలను విజయవంతంగా నిర్వహించే క్రమంలో మరియు మీకు మా ఉత్పత్తులు లేదా సేవలకు సంబంధించిన అన్ని ఫీచర్‌లను అందించడానికి, మేము Xiaomi అనుబంధ సంస్థలతో కాలానుగుణంగా మీ వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవచ్చు.

3.1.3 మా గ్రూప్ ఎకోసిస్టమ్ కంపెనీలతో పంచుకోవడం

Xiaomi ప్రామాణిక విధానాలను అనుసరించే గ్రూప్ ఆఫ్ కంపెనీలతో కలిసి పని చేస్తుంది, ఇవన్నీ కలిసి Xiaomi ఎకోసిస్టమ్‌గా రూపొందించబడుతుంది. Xiaomi ఎకోసిస్టమ్ కంపెనీలు Xiaomi పెట్టుబడులు పెట్టిన మరియు ప్రారంభించిన స్వతంత్ర సంస్థలు మరియు వాటి రంగాల్లో నైపుణ్యం కలిగినవి. Xiaomi మీ వ్యక్తిగత సమాచారాన్ని ఎకోసిస్టమ్ కంపెనీలకు వెల్లడించవచ్చు, దీని వల్ల ఎకోసిస్టమ్ కంపెనీల నుండి (హార్డ్‌వేర్ మరియు సాఫ్ట్‌వేర్ రెండింటికీ సంబంధించి) ఆసక్తికరమైన ఉత్పత్తులు మరియు సేవలను అందించవచ్చు మరియు మరింత మెరుగుపరచవచ్చు. ఈ ఉత్పత్తులు లేదా సేవలలో కొన్ని ఇప్పటికీ Xiaomi బ్రాండ్ కింద ఉంటాయి, మిగతావి వాటి స్వంత బ్రాండ్‌ను ఉపయోగించవచ్చు. ఎకోసిస్టమ్ కంపెనీలు హార్డ్‌వేర్ మరియు సాఫ్ట్‌వేర్ సేవలను అందించడానికి, మెరుగైన ఫంక్షన్‌లు మరియు వినియోగదారు అనుభవాన్ని అందించడానికి Xiaomiతో Xiaomi బ్రాండ్ క్రింద ఉత్పత్తులు మరియు సేవలకు సంబంధించి కాలానుగుణంగా Xiaomiతో సమాచారాన్ని పంచుకోవచ్చు. Xiaomi మీ వ్యక్తిగత సమాచార భద్రతను నిర్ధారించడానికి మీ వ్యక్తిగత సమాచారాన్ని ఎన్‌క్రిప్ట్ చేయడంతో సహా తగిన నిర్వహణ మరియు సాంకేతికమైన ప్రమాణాలను పాటిస్తుంది.

3.1.4 మూడవ పక్ష సేవా ప్రదాతలు మరియు వ్యాపార భాగస్వాములతో పంచుకోవడం

ఈ గోప్యతా విధానంలో వివరించిన ఉత్పత్తులు మరియు సేవలను మీకు అందించడంలో మాకు సహాయకరంగా, మేము మా మూడవ పక్ష సేవా ప్రదాతలు మరియు వ్యాపార భాగస్వాములతో మీ వ్యక్తిగత సమాచారాన్ని అవసరమైన చోట పంచుకుంటాము.

ఇందులో భాగంగా మా డెలివరీ సేవా ప్రదాతలు, డేటా కేంద్రాలు, డేటా నిల్వ ప్రదేశాలు కస్టమర్ సేవా ప్రదాతలు, వాణిజ్య ప్రకటనలు మరియు మార్కెటింగ్ సేవా ప్రదాతలు మరియు ఇథర వ్యాపార భాగస్వాములు ఉండవచ్చు. ఈ మూడవ పక్షాలు మీ వ్యక్తిగత సమాచారాన్ని Xiaomi తరపున లేదా ఈ గోప్యతా విధానంలోని ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ప్రయోజనాల కోసం ప్రాసెస్ చేయవచ్చు. మేము పూర్తిగా చట్టబద్ధమైన, న్యాయమైన, ఆనివార్యమైన, నిర్దిష్టమైన మరియు స్పష్టమైన ప్రయోజనాల కోసమే మీకు సేవలను అందించడానికి అవసరమైన వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవడానికి కట్టుబడి ఉంటాము. మూడవ పక్ష సేవా ప్రదాతలు మీ చట్టపరిధిలోని వర్తించే గోప్యతా చట్టాలకు అనుగుణంగా ఉన్నట్లు నిర్ధారించుకోవడానికి Xiaomi తగిన శ్రద్ధను వహిస్తుంది మరియు ఆ ప్రదేశంలో ఒప్పందాలు కలిగి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మూడవ పక్ష సేవా ప్రదాతలు తమ ఉప-ప్రాసెసర్‌లను కలిగి ఉండవచ్చు.

పనితీరు గణన, విశ్లేషణ మరియు ఇతర వ్యాపార సేవలను అందించడానికి, మేము సమాచారాన్ని (వ్యక్తిగతం కానిది) సమగ్ర రూపంలో మూడవ పక్షాలతో కూడా (మా వెబ్‌సైట్‌లలో ప్రకటనదారులు వంటి) పంచుకోవచ్చు. ప్రకటనదారులు మరియు ఇతర వ్యాపార భాగస్వాములు తమ ప్రకటన మరియు సేవల ప్రభావాన్ని మరియు కవరేజీని మూల్యాంకనం చేయడానికి మరియు తమ సేవలను ఎటువంటి వ్యక్తులు వినియోగిస్తారో మరియు వ్యక్తులు తమ వెబ్‌సైట్‌లు, యాప్‌లు మరియు సేవలతో ఎలా పరస్పర చర్య చేస్తారో అర్థం చేసుకోవడానికి మేము మా వద్ద ఉన్న సమాచారాన్ని ఉపయోగించుకోవచ్చు. మేము మా సేవలకు సంబంధించిన సాధారణ వినియోగ ట్రెండ్‌లను వారితో పంచుకుంటాము, అవి నిర్దిష్ట ఉత్పత్తులను కొనుగోలు చేసిన లేదా నిర్దిష్ట లావాదేవీలు జరిపిన నిర్దిష్ట వ్యక్తుల సమూహంలోని కస్టమర్‌ల సంఖ్య వంటివి.

3.1.5 ఇతరములు

న్యాయ ఆవశ్యకాలు, న్యాయ విధానాలు, లిటిగేషన్ మరియు/లేదా పబ్లిక్ ఏజెన్సీలు మరియు ప్రభుత్వ ఏజెన్సీలకు సంబంధించి, Xiaomi మీ వ్యక్తిగత సమాచారాన్ని వెల్లడించవలసి ఉండవచ్చు. జాతీయ భద్రత, చట్ట అమలు లేదా ప్రజా ప్రాముఖ్యానికి సంబంధించిన ఇతర విషయాల కోసం బహిర్గతం చేయడం ఆవశ్యకం లేదా తప్పనిసరి అయితే, మేము మీ గురించిన సమాచారాన్ని వెల్లడించవచ్చు.

మా నిబంధనలను అమలు చేసే లేదా మా వ్యాపారం, హక్కులు, ఆస్తులు లేదా ఉత్పత్తులను రక్షించే క్రమంలో లేదా వినియోగదారులను రక్షించడానికి లేదా క్రింది కారణాల కోసం బహిర్గతం చేయడం తగిన విధంగా ఆవశ్యకమైతే (మోసం, ఉత్పత్తి అనధికారిక వినియోగం, మా నిబంధనలు లేదా విధానాల ఉల్లంఘన లేదా ఇతర హానికరమైన లేదా చట్ట వ్యతిరేక కార్యకలాపాలను గుర్తించడం, నివారించడం లేదా పరిష్కరించడం) మేము మీ గురించిన సమాచారాన్ని వెల్లడించవచ్చు. Xiaomi వర్తించే డేటా రక్షణ చట్టాల ప్రకారం అనుమతించే పరిధి మేరకు మాత్రమే మీ వ్యక్తిగత సమాచారాన్ని సేకరించవచ్చు, ఉపయోగించవచ్చు లేదా ఇతరులకు వెల్లడించవచ్చు. ఇందులో పబ్లిక్ లేదా ప్రభుత్వ ఏజెన్సీలకు మీ వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవడం లేదా మోసాన్ని, ఉల్లంఘనలను నివారించడానికి మీ ఖాతా విశ్వసనీయత గురించి మూడవ పక్ష భాగస్వాములతో కమ్యూనికేట్ చేయడం మరియు ఇతర హానికర ప్రవర్తనలు ఉండవచ్చు.

అదనంగా, మేము మీ వ్యక్తిగత సమాచారాన్ని వీరితో పంచుకోవచ్చు:

• మా అకౌంటెంట్‌లు, ఆడిటర్‌లు, న్యాయవాదులు లేదా మేము వృత్తిపరమైన సలహా ఇవ్వమని కోరినప్పుడు అటువంటి సలహాదారులతో;

• Xiaomi గ్రూప్‌లో సంస్థకు సంబంధించి వాస్తవమైన లేదా సంభావ్య విక్రయం లేదా ఇతర కార్పొరేట్ లావాదేవీ జరిగినప్పుడు అందులో భాగమైన పెట్టుబడిదారులు మరియు ఇతర సంబంధిత మూడవ పక్షాలు; మరియు

• ఈ గోప్యతా విధానంలో వివరించిన లేదా మీకు తెలియజేసిన ఇతర మూడవ పక్షాలు, అలాగే నిర్దిష్ట అంశాలు వెల్లడించడానికి మీరు అధికారం మంజూరు చేసిన వారు.

3.2 బదిలీ

Xiaomi క్రింది సందర్భాలలో మినహా దేని గురించి అయినా మీ సమాచారాన్ని బదిలీ చేయదు:

• మేము మీ స్పష్టమైన సమ్మతిని పొంది ఉంటే;

• ఒకవేళ మీ వ్యక్తిగత సమాచారాన్ని ప్రభావతం చేసే రీతిలో Xiaomiకి సంబంధింిన యావత్తు ఆసక్తులు లేదా కొంత భాగానికి సంబంధించి విలీనత, స్వాధీనపర్చుకోవడం లేదా అమ్మకం లాంటివి జరిగితే, యాజమాన్య హక్కు, వినియోగం మరియు మీ వ్యక్తిగత సమాచారానికి సంబంధించి మీకు ఉండగలిగే ఏవైనా మార్గాల విషయంలో ఏవైనా మార్పులు జరిగి ఉంటే, వాటి గుిరంచి ఇమెయిల్ పంపడం మరియు/లేదా మా వెబ్‌సైట్‌లు లేదా ఇతర సంబంధిత మార్గాలలో పోస్ట్ చేయడం ద్వారా మీకు తెలియజేస్తాము;

• ఈ గోప్యతా విధానంలో వివరించిన లేదంటే మీకు సమాచారం అందించి ఉండే పరిస్థితులలో.

3.3 పబ్లిక్‌కి వెల్లడి

Xiaomi ఈ క్రింది పరిస్థితులలో మీ వ్యక్తిగత సమాచారాన్ని బహిరంగంగా వెల్లడించవచ్చు:

• ఒక ప్రోత్సాహకం, పోటీ లేదా పందెములో విజేతను ప్రకటించాల్సిన సందర్భాలలో మేము పరిమిత సమాచారాన్ని మాత్రమే ప్రచురిస్తాము;

• మీ నుండి ప్రత్యేక సమ్మచిత పొందన సందర్భాలలో లేదా మేము కలిగి ఉన్న సోషల్ మీడియా పేజీలు లేదా పబ్లిక్ ఫోరమ్‌లు లాంటి సేవలలో మీరు వెల్లడించిన సమాచారం; మరియు

• చట్టబద్ధంగా లేదా సహేతుకమైన కారణాల వలన బహిరంగంగా వెల్లడించినవి: చట్టాలు మరియు నియంత్రణలు, న్యాయ విధానాలు, వ్యాజ్యం లేదా యోగ్యమైన ప్రభుత్వ శాఖల అభ్యర్థనపై అందించిన వాటికి కూడా వర్తిస్తుంది.

4. మేము మీ వ్యక్తిగత సమాచారాన్ని ఎలా నిల్వ చేస్తాము మరియు రక్షిస్తాము

4.1 Xiaomi భద్రతా రక్షణలు

మేము మీ వ్యక్తిగత సమాచారాన్ని సురక్షితంగా ఉండేలా చూడటానికి కట్టుబడి ఉన్నాము. అనధికారిక ప్రవేశం, వెల్లడి లేదా ఇతర సారూప్య ప్రమాదాలను అరికట్టడానికి, మేము మొత్తం న్యాయ పరంగా ఆవశ్యకమైన భౌతిక, ఎలక్ట్రానిక్ మరియు నిర్వహణ సంబంధ ప్రక్రియలను అమలు చేస్తున్నాము, తద్వారా మేము మీ మొబైల్ పరికరం మరియు Xiaomi వెబ్‌సైట్‌లలో సేకరించే సమాచారాన్ని సురక్షితంగా కాపాడుతున్నాము. వర్తించదగిన చట్టానికి అనుగుణంగా మేము మీ వ్యక్తిగత సమాచారానికి భద్రతను అందిస్తున్నామని మేము నిర్ధారించుకోవాలి.

ఉదాహరణకు, మీరు మీ Xiaomi ఖాతాలోకి ప్రవేశిస్తున్నప్పుడు, మెరుగైన భద్రత కోసం మా రెండు దశల ధృవీకరణ ప్రోగ్రామ్‌ను వినియోగించేలా మీరు ఎంచుకోవచ్చు, మీరు దీన్ని తప్పకుండా ఎంచుకోవాలని మేము ప్రబలంగా సిఫార్సు చేస్తున్నాము. మీ వ్యక్తిగత సమాచారాన్ని మీ Xiaomi పరికరం మరియు మా సర్వర్‌ల మధ్య పంపుతున్నప్పుడు, ట్రాన్స్‌పోర్ట్ లేయర్ సెక్యూరిటీ (టిఎల్‌ఎస్) మరియు తగిన ఎన్‌క్రిప్షన్ అల్గారిథమ్‌లను ఉపయోగించడం ద్వారా డేటా ఎన్‌క్రిప్ట్ చేసే విధంగా చూసుకుంటాము.

మీ వ్యక్తిగత సమాచారం అంతా సురక్షిత సర్వర్లలో నిల్వ చేయబడుతుంది మరియు నియంత్రిత ప్రదేశాల్లో రక్షణ అందించబడుతుంది. మేము ప్రాముఖ్యత మరియు సున్నితత్వం బట్టి మీ సమాచారాన్ని వర్గీకరిస్తాము మరియు మీ వ్యక్తిగత సమాచారానికి ఆవశ్యకమైన భద్రతా స్థాయి ఉన్నట్లు నిర్ధారించుకోండి. క్లౌడ్ ఆధారిత డేటా నిల్వ కోసం మా వద్ద ప్రత్యేక ప్రవేశ నియంత్రణలు ఉన్నాయి మరియు మేము ఎల్లవేళలా మా సమాచార సేకరణ, నిల్వ మరియు ప్రాసెసింగ్ విధానాలను, వాటితో పాటు భౌతిక భద్రతా రక్షణలను సమీక్షిస్తాము మరియు ఎలాంటి అనధికారిక ప్రవేశం మరియు వినియోగం జరగకుండా కాపాడుకుంటాము.

మేము వ్యాపార భాగస్వాములు మరియు మూడవ పక్ష సేవా ప్రదాతలు మీ వ్యక్తిగత సమాచారాన్ని రక్షించగలరని నిర్ధారించుకోవడానికి వారి పట్ల తగిన శ్రద్ధ చూపుతాము. ఒప్పందానికి సంబంధించిన తగిన నియంత్రణలను, అవసరమైన, నెరవేర్చదగిన ఆడిట్‌లు మరియు అసెస్‌మెంట్‌లను ఒకే చోట ఉంచడం ద్వారా ఈ మూడవ పక్షాలచే తగిన భద్రతా ప్రమాణాలు సరిగ్గా నిర్వహించబడుతున్నాయని కూడా మేము తనిఖీ చేస్తాము. అదనంగా, మా ఉద్యోగులు, మీ వ్యక్తిగత సమాచారానికి ప్రవేశం పొందగల మా వ్యాపార భాగస్వాములు మరియు మూడవ పక్ష సేవా ప్రదాతలు అమలు చేయదగిన గోప్యతా బాధ్యతలకు కట్టుబడి ఉంటారు.

మేము ఉద్యోగుల్లో వ్యక్తిగత సమాచారాన్ని రక్షించాల్సిన ప్రాముఖ్యత గురించి అవగాహనను మెరుగుపరచడానికి భద్రత మరియు గోప్యతా రక్షణకు సంబంధించిన శిక్షణ కోర్సులను నిర్వహిస్తాము. మీ వ్యక్తిగత సమాచారాన్ని కాపాడేందుకు మేము అన్ని ఆచరణ సాధ్యమైన మరియు ఆవశ్యక చర్యలను పాటిస్తాము. ఏదేమైనప్పటికీ, ఇంటర్నెట్ వినియోగం అన్నది పూర్తి స్థాయి సురక్షితం కాదని మీరు గుర్తుంచుకోవాలి, ఇందుచేత ఇంటర్నెట్‌లో మీ నుండి గానీ లేదా మీకు గానీ పంపబడినప్పుడు వ్యక్తిగత సమాచారం భద్రత లేదా సమగ్రతకు మేము హామీ ఇవ్వలేమని అర్థం చేసుకోగలరు.

మేము వ్యక్తిగత డేటా ఉల్లంఘనలను వర్తించదగిన డేటా రక్షణ చట్టం ప్రకారం అవసరమైన విధంగా నిర్వహిస్తాము, ఇందులో సముచిత డేటా రక్షణ పర్యవేక్షణ అధికారం మరియు డేటా విషయాల ఉల్లంఘనలు తెలియజేయబడతాయి.

మా సమాచార భద్రత విధానాలు మరియు పద్ధతులను అంతర్జాతీయ ప్రమాణాలు దృష్టిలో ఉంచుకుని రూపొందించడం జరిగింది, అలాగే ప్రభావశీలతను ధృవపరచుకోవడానికి క్రమం తప్పకుండా మూడవ పక్షంతో ఆడిట్‌లు జరుపుతాము. Xiaomi సమాచార వ్యవస్థ, అన్నది సమాచార సురక్షిత నిర్వహణ వ్యవస్థల (ISMS) అంశంలో ISO/IEC 27001:2013 సర్టిఫికేషన్‌ను పొందింది. Xiaomi ఇ-కామర్స్ మరియు Mi హోమ్/Xiaomi Home IoT ప్లాట్‌ఫామ్‌లు వ్యక్తిగత సమాచార నిర్వహణ వ్యవస్థల (PIMS) అంశంలో ISO/IEC 27701:2019 సర్టిఫికేషన్‌ను పొందాయి. Xiaomi ఆపరేటింగ్ సిస్టమ్ పబ్లిక్ క్లౌడ్ వ్యక్తిగత సమాచార రక్షణ కోసం ISO/IEC 27018:2019 సర్టిఫికేషన్‌ను పొందింది.

4.2 మీరు ఏమి చేయవచ్చు

Xiaomiలో మీ ఖాతా భద్రతకు హాని కలిగించగల ఇతర వెబ్‌సైట్‌లకు పాస్‌వర్డ్ లీక్ కాకుండా జాగ్రత్త తీసుకోవడానికి మీ లాగిన్ పాస్‌వర్డ్ లేదా ఖాతా సమాచారాన్ని ఎవరికీ వెల్లడించకుండా (అటువంటి వ్యక్తికి మీరు అధికారం ఇచ్చి ఉంటే తప్ప) ఉండవచ్చు మరియు మీరు Xiaomi సేవల కోసం ఒక ప్రత్యేక పాస్‌వర్డ్‌ను సెట్ చేసుకోవచ్చు. మీరు స్వీకరించిన ధృవీకరణ కోడ్‌లను ఎలాంటి సందర్భంలోనూ ఎవరికీ (Xiaomi కస్టమర్ సర్వీస్ నుండి సంప్రదిస్తున్నామని పేర్కొనేవారితో సహా) వెల్లడించవద్దు. మీరు Xiaomi వెబ్‌సైట్‌లలో Xiaomi ఖాతా వినియోగదారుగా లాగిన్ చేసిన ఎప్పుడైనా, ప్రత్యేకించి వేరేవాళ్ల కంప్యూటర్‌లో లేదా ఇంటర్నెట్ కెఫేల వంటి వాటిలో చేసినప్పుడు, మీ సెషన్ ముగిసిన అనంతరం తప్పక లాగ్ అవుట్ చేయాలి.

మీ వ్యక్తిగత సమాచారాన్ని ప్రైవేట్‌గా ఉంచుకోవడంలో మీ వైఫల్యం కారణంగా మీ వ్యక్తిగత సమాచారానికి ప్రవేశం పొందే ఒక మూడవ పక్షం ద్వారా వాటిల్లే భద్రతాపరమైన దాడులకు Xiaomiకి ఎటువంటి బాధ్యత ఉండదు. ఇంతకుముందు ఎప్పుడైనా జరిగినప్పటికీ, మీ ఖాతాను వేరెవరైనా ఇంటర్నెట్ వినియోగదారు అనధికారికంగా ఉపయోగిస్తే లేదా భద్రతపరమైన ఉల్లంఘన చోటుచేసుకుంటే తక్షణం మీరు మాకు తెలియజేయాలి. మీ వ్యక్తిగత సమాచారం గోప్యతను కాపాడటంలో మీ సహకారం మాకు సహాయపడుతుంది.

4.3 మీ పరికరం ఇతర ఫీచర్‌లకు ప్రవేశాన్ని పొందడం

పరిచయాలు, SMS నిల్వ, Wi-Fi నెట్‌వర్క్ స్థితి వంటి ఉపయోగించడానికి ఇమెయిల్‌ను అనుమతించడం లాంటి నిర్దిష్ట రకమైన ఫీచర్‌లకు మా అప్లికేషన్‌లు ప్రవేశానుమతి పొందవచ్చు. ఈ సమాచారం మీ పరికరంలో అప్లికేషన్‌లను అనుమతించడానికి మరియు అప్లికేషన్‌లతో ఇంటరాక్ట్ అయ్యేందుకు మిమ్మల్ని అనుమతించడానికి ఉపయోగించబడుతుంది. మీరు మీ పరికరంలో ఏ సమయంలోనైనా లేదా https://privacy.mi.com/supportలో మమ్మల్ని సంప్రదించడం ద్వారా ఈ ఫీచర్‌లను ఆఫ్ చేయవచ్చు.

4.4 నిల్వ విధానం

గోప్యతా విధానంలో వివరించిన సమాచార సేకరణ కారణం కోసం లేదా నిర్దిష్ట ఉత్పత్తి లేదా సేవ కోసం అందించిన ఏదైనా ప్రత్యేక గోప్యతా విధానం కోసం లేదా వర్తించదగిన చట్టాల ద్వారా అవసరమైన వ్యవధి కోసం మేము వ్యక్తిగత సమాచారాన్ని నిలిపి ఉంచవచ్చు. నిర్దిష్ట సేవ లేదా సంబంధిత ఉత్పత్తి పేజీలో సవివరమైన నిలుపుదల వ్యవధుల వివరాలు పేర్కొనబడ్డాయి. సేకరించిన ఉద్దేశం నెరవేర్చబడితే లేదా తొలగింపు కోసం మేము మీ అభ్యర్థనను నిర్ధారించిన తర్వాత లేదా సంబంధిత ఉత్పత్తి లేదా సేవ చర్యను మేము నిలిపివేసిన తర్వాత వ్యక్తిగత సమాచారాన్ని నిలిపి ఉంచడానికి మరియు తొలగించడానికి లేదా అజ్ఞాతంగా ఉంచడానికి మేము దాన్ని నిలిపివేస్తాము. సాధ్యమైన సందర్భాలలో, వ్యక్తిగత డేటా కింద గుర్తించిన వర్గాలు, రకాలు లేదా అంశాలను మేము ఎంతకాలం నిల్వ చేసి ఉంచుతామో సూచించాము. ఈ నిల్వ వ్యవధులను నిర్ణయించేటప్పుడు, మేము కింది ప్రమాణాలను పరిగణనలోకి తీసుకున్నాము:

• వ్యక్తిగత సమాచారం పరిమాణం, స్వభావం మరియు గోప్యంగా ఉంచాల్సిన ఆవశ్యకత;

• అనధికార ఉపయోగం లేదా బహిర్గతం నుండి హాని కలిగే ప్రమాదం;

• మేము వ్యక్తిగత సమాచారాన్ని ప్రాసెస్ చేసే ప్రయోజనాలు మరియు ఈ ప్రయోజనాలను సాధించడానికి మాకు ఎంతకాలం నిర్దిష్ట డేటా అవసరం;

• వ్యక్తిగత సమాచారం ఎంతకాలం ఖచ్చితం మరియు తాజా రీతిలో ఉంటుంది;

• భవిష్యత్తు చట్టపరమైన దావాలకు వ్యక్తిగత సమాచారం ఎంత కాలం సంబంధితంగా ఉంటుంది; మరియు

• కొన్ని రికార్డులు ఎంతకాలం భద్రపరిచి, ఉంచాలో పేర్కొనే ఏదైనా వర్తించే చట్టపరమైన, జవాబుదారీ, రిపోర్టింగ్ లేదా నియంత్రణ ఆవశ్యకతలు.

మీ జురిస్డిక్షన్‌ను బట్టి, ప్రజా ప్రయోజనం, శాస్త్రీయమైన, చారిత్రాత్మక పరిశోధన లేదా గణాంక ప్రయోజనాల కోసం మేము ప్రాసెస్ చేసే వ్యక్తిగత సమాచారానికి ఈ విషయంలో మినహాయింపు ఉండవచ్చు. Xiaomi తదనంతర డేటా ప్రాసెసింగ్ సేకరణ అసలు కారణానికి సంబంధించినది కాకపోయినా కూడా వర్తించే చట్టాలు లేదా మీ అభ్యర్థన ఆధారంగా అవసరమైన, అనుమతించిన ప్రామాణిక నిల్వ వ్యవధి కంటే ఎక్కువ కాలం ఈ రకమైన సమాచారాన్ని నిల్వ చేయడం కొనసాగిస్తుంది.

5. మీ హక్కులు

మీ వ్యక్తిగత సమాచారాన్ని నియంత్రించగల సామర్థ్యం మీకు ఉంటుంది.

5.1 సెట్టింగ్‌లను నియంత్రించడం

గోప్యతా సమస్యలు వ్యక్తిని బట్టి మారవచ్చని Xiaomi గుర్తించింది. కాబట్టి, మీ వ్యక్తిగత సమాచారాన్ని సేకరించే, వినియోగించే, వెల్లడించే లేదా ప్రాసెస్ చేసే విధానాన్ని పరిమితం చేయడం మరియు మీ గోప్యతా సెట్టింగ్‌లను నియంత్రించడం కోసం Xiaomi మీకు అందుబాటులో ఉంచే మార్గాలకు సంబంధించిన ఉదాహరణలను మేము అందిస్తున్నాము:

• వినియోగదారు అనుభవ కార్యక్రమం మరియు ప్రదేశ యాక్సెస్ ఫీచర్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయండి;

• Xiaomi ఖాతాకి సైన్ ఇన్ లేదా సైన్ అవుట్ చేయడం;

• Xiaomi క్లౌడ్ సింక్ ఆన్ లేదా ఆఫ్ చేయడం;

https://i.mi.com ద్వారా Xiaomi క్లౌడ్‌లో నిల్వ చేయబడిన ఏదైనా సమాచారాన్ని తొలగించండి.

• గోప్యమైన లేదా వ్యక్తిగత సమాచారానికి సంబంధించిన ఇతర సేవలు మరియు ఫీచర్‌లను ఆన్/ఆఫ్ చేయడం. అలాగే, మీరు భద్రతా యాప్‌లో మీ పరికరం యొక్క భద్రతా స్థితికి సంబంధించి మరిన్ని వివరాలను పొందవచ్చు.

ఎగువ పేర్కొన్న ప్రయోజనాల కోసం మీ వ్యక్తిగత సమాచారాన్ని ఉపయోగించేందుకు మీరు గతంలో అంగీకరించినట్లయితే, మీరు మా ప్రాధాన్యతలను మార్చడానికి https://privacy.mi.com/supportలో మమ్మల్ని సంప్రదించవచ్చు.

5.2 మీ వ్యక్తిగత సమాచారానికి మీ హక్కులు

వర్తించే చట్టాలు మరియు నిబంధనల ప్రకారం, మేము మీ గురించి కలిగి ఉన్న వ్యక్తిగత సమాచారానికి ప్రవేశం పొందడానికి, సరిచేయడానికి, తీసివేయడానికి మీకు హక్కు (నిర్ణీత ఇతర హక్కులు) ఉండగలదు (ఇకమీదట అభ్యర్థనగా పేర్కొంటాము). వర్తించే చట్టాల ప్రకారం ఈ హక్కులు నిర్దిష్ట మినహాయింపులకు లోబడి లభిస్తాయి.

అలాగే మీరు https://account.xiaomi.comకి వెళ్లి, మీ Xiaomi ఖాతాలో లేదా మీ పరికరంలో మీ ఖాతాకు లాగిన్ చేయడం ద్వారా వ్యక్తిగత సమాచారానికి సంబంధించిన వివరాలకు ప్రవేశం పొందవచ్చు మరియు అప్‌డేట్ చేయవచ్చు. అదనపు సమాచారం కోసం, దయచేసి https://privacy.mi.com/support ద్వారా మమ్మల్ని సంప్రదించండి.

మీ అభ్యర్థన కింది షరతులకు అనుగుణంగా ఉంటే వీలైనంత సమర్థవంతంగా నెరవేర్చడానికి ఇది మాకు సహాయపడుతుంది:

(1) పైన వివరించిన Xiaomi ప్రత్యేక అభ్యర్థన విధానంలో అభ్యర్థనను సమర్పించినా కూడా, మీ అభ్యర్థన వ్రాతపూర్వకంగా ఉండాలి (స్థానిక చట్టంలో మౌఖిక అభ్యర్థనను ప్రత్యేకంగా పరిగణించే పరిస్థితి ఉంటే మినహా);

(2) మీ గుర్తింపును ధృవీకరించడం, అలాగే మీరే డేటా సబ్జెక్ట్ అని లేదా డేటా సబ్జెక్ట్ తరఫున వ్యవహరించడానికి చట్టబద్ధమైన అధికారం మీకు ఉందని నిర్ధారించడంలో Xiaomiకి సహాయపడటానికి మీరు తగిన సమాచారాన్ని అందించాలి.

మీ అభ్యర్థనను ప్రాసెస్ చేయవచ్చని నిర్ధారించడానికి తగిన సమాచారాన్ని మేము పొందిన తర్వాత, మీ వర్తించదగిన డేటా రక్షణ చట్టాల క్రింద సెట్ చేయబడిన ఏదైనా సమయ పరిధిలోపు మీ అభ్యర్థనకు ప్రతిస్పందించడం కొనసాగిస్తాము.

వివరంగా:

• మేము మీ వ్యక్తిగత సమాచారాన్ని ఉపయోగించే విధానం మరియు మీ హక్కుల గురించి స్పష్టమైన, పారదర్శకమైన మరియు సులభంగా అర్థం చేసుకోగల సమాచారం పొందడానికి మీకు హక్కు ఉంది. అందుకే ఈ గోప్యతా విధానంలో మేము మీకు సమాచారాన్ని అందిస్తున్నాము.

• వర్తించదగిన చట్టాల యొక్క ఆవశ్యకాలకు అనుగుణంగా, మేము సేకరించిన మరియు ప్రాసెస్ చేసిన మీ వ్యక్తిగత సమాచారం కాపీని మీ అభ్యర్థనపై ఎలాంటి ఛార్జీ విధించకుండా ఉచితంగా మీకు అందిస్తాము. సంబంధిత సమాచారం కోసం చేసే ఏవైనా అదనపు అభ్యర్థనల కోసం మేము వర్తించే చట్టాలకు అనుగుణంగా అనుమతి ఉంటే, అసలైన నిర్వహణ ధరల ఆధారంగా సహేతుక రుసుమును ఛార్జీ చేయవచ్చు.

• మీ గురించి మేము కలిగి ఉన్న ఏదైనా సమాచారం తప్పుగా లేదా అసంపూర్ణంగా ఉన్న పక్షంలో, వినియోగ ప్రయోజనం ఆధారంగా మీ వ్యక్తిగత సమాచారాన్ని సరి చేసే లేదా పూర్తి చేసే అధికారం మీకు ఉంది.

• వర్తించదగిన చట్టాల ఆవశ్యకాల ఆధారంగా, మీ వ్యక్తిగత సమాచారాన్ని మేము ఉపయోగించడం కొనసాగించడానికి అవసరమైన కారణం ఏదీ లేనప్పుడు మీ వ్యక్తిగత సమాచారాన్ని తొలగించమని లేదా తీసివేయమని అభ్యర్థించే హక్కు మీకు ఉంది. మీరు చేసిన తొలగింపు అభ్యర్థనకు సంబంధించిన ఆధారాలను మేము పరిగణించి, సాంకేతిక ప్రమాణాలతో సహా తగిన చర్యలు తీసుకుంటాము. వర్తించే చట్టం మరియు/లేదా సాంకేతికపరమైన పరిమితుల కారణంగా బ్యాకప్ సిస్టమ్ నుండి సమాచారాన్ని మేము తక్షణం తీసివేయలేకపోవచ్చని గుర్తుంచుకోండి. ఇలాంటి సందర్భంలో, మేము మీ వ్యక్తిగత సమాచారాన్ని సురక్షితంగా నిల్వ చేసి, బ్యాకప్ తొలగించే వరకు లేదా అనామకం చేసే వరకు తదుపరి ప్రాసెసింగ్ ఏదీ జరగకుండా దాన్ని వేరు చేస్తాము.

• డైరెక్ట్ మార్కెటింగ్ కోసం ప్రాసెస్ చేయడంతో సహా (ప్రొఫైలింగ్ ఉపయోగించబడే చోట్లతో సహా) మరియు ప్రాసెస్ చేయడానికి (ప్రొఫైలింగ్‌తో సహా) చట్టపరమైన ఆధారం అనేది మా న్యాయపరమైన ఆసక్తులు అయిన నిర్దిష్ట సందర్భాలలో నిర్దిష్ట రకాల ప్రాసెసింగ్‌కు అభ్యంతరం తెలిపే హక్కు మీకు ఉంది.

కొన్ని అధికార పరిధులలోని చట్టాల క్రింద నిర్దిష్టంగా:

• మీ వ్యక్తిగత సమాచారాన్ని ప్రాసెస్‌ను పరిమితి కోసం మమ్మల్ని అభ్యర్థించడానికి హక్కు మీకు ఉంది. మీ నియంత్రణ అభ్యర్థనకు సంబంధించిన ఆధారాలను మేము పరిగణిస్తాము. GDPR ప్రకారం ఆధారాలు వర్తించే పక్షంలో, మేము GDPR ప్రకారం వర్తించే పరిస్థితుల క్రింద మాత్రమే మీ వ్యక్తిగత సమాచారాన్ని ప్రాసెస్ చేస్తాము, అలాగే ప్రాసెసింగ్‌పై విధించిన నియంత్రణను ఎత్తివేసే ముందు మీకు తెలియజేస్తాము.

• మీకు సంబంధించిన లేదా అదే విధంగా మీపై గణనీయంగా ప్రభావం చూపే చట్టపరమైన ప్రభావాలను కలగజేసేటటువంటి ప్రొఫైలింగ్‌తో సహా కేవలం స్వయంచాలక ప్రాసెసింగ్ ఆధారంగా తీసుకున్న నిర్ణయానికి లోబడి ఉండకుండా ఉండే హక్కు మీకు ఉంది.

• మీ వ్యక్తిగత సమాచారాన్ని నిర్మాణాత్మకమైన, సాధారణంగా ఉపయోగించే ఆకృతిలో పొందడం కోసం దరఖాస్తు చేయడానికి మరియు సమాచారాన్ని మరొక డేటా కంట్రోలర్ (డేటా సులభ వాహ్యత)కు పంపించడానికి మీకు హక్కు ఉంది.

అభ్యర్థనలను ప్రాసెస్ చేయడానికి నిరాకరించే హక్కు మాకు ఉంది లేదా మినహాయింపు వర్తించే అభ్యర్ధనలతో కొంతవరకు మాత్రమే కట్టుబడి ఉండటానికి లేదా వర్తించే చట్టాల ప్రకారం ఆ విధంగా వ్యవహరించడానికి మాకు హక్కు ఉంటుంది, అంటే అభ్యర్థనను మానిఫెస్ట్‌గా కనుగొని ఉండకపోవడం లేదా మానిఫెస్ట్ ప్రకారం అధికంగా ఉండట లేదా మూడవ పక్షాల గురించి సమాచార వెల్లడి ఆవశ్యకత లాంటివి. కొన్ని సందర్భాలలో, వర్తించే చట్టాల ప్రకారం అనుమతించిన సందర్బాలలో మేము ఫీజు ఛార్జీ విధించవచ్చు. సమాచారాన్ని తొలగించాలనే అభ్యర్థనలోని కొన్ని అంశాలు చట్టపరమైన దావాలు వేయడానికి, నిర్వహించడానికి లేదా వాటి నుండి రక్షణ పొందడానికి లేదా వర్తించే చట్టంలో అనుమతించే కారణాల కోసం చట్టపరంగా ఉపయోగించగలిగే మా సామర్థ్యాన్ని కోల్పోయే పరిస్థితి కలిగిస్తాయని మేము విశ్వసిస్తే, దాన్ని కూడా తిరస్కరించవచ్చు.

5.3 సమ్మతి ఉపసంహరణ

మా ఆధీనం లేదా నియంత్రణలో ఉన్న మీ వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడం, వినియోగించడం మరియు/లేదా వెల్లడించడంతో సహా వంటి నిర్దిష్ట ప్రయోజనం కోసం మునుపు మాకు అందించిన మీ సమ్మతిని మీరు అభ్యర్థనను సమర్పించడం ద్వారా ఉపసంహరించుకోవచ్చు. మీరు ఉపయోగిస్తున్న నిర్దిష్ట సేవను బట్టి, https://privacy.mi.com/supportలో మమ్మల్ని సంప్రదించవచ్చు. అభ్యర్థనను పంపినప్పటి నుండి సహేతుక సమయంలోపు మేము మీ అభ్యర్థనను ప్రాసెస్ చేస్తాము, అలాగే మీ అభ్యర్థన ప్రకారం మీ వ్యక్తిగత సమాచారాన్ని సేకరించము, వినియోగించము మరియు/లేదా వెల్లడించము.

మీ సమ్మతి ఉపసంహరణ పరిధి ఆధారంగా, దయచేసి మీరు Xiaomi ఉత్పత్తులు మరియు సేవల యొక్క పూర్తి ప్రయోజనాన్ని స్వీకరించడాన్ని కొనసాగించలేకపోవచ్చని గుర్తుంచుకోండి. మీ సమ్మతి లేదా ప్రామాణీకరణను ఉపసంహరించుకోవడం వలన ఉపసంహరించే సమయం వరకు సమ్మతి ఆధారంగా నిర్వహించబడే మా ప్రాసెసింగ్ చెల్లుబాటుపై ఎలాంటి ప్రభావం ఉండదు.

5.4 సేవ లేదా ఖాతాను రద్దు చేయడం

మీరు నిర్దిష్ట ప్రోడక్ట్ లేదా సేవను రద్దు చేయాలనుకుంటే, మీరు మమ్మల్ని https://privacy.mi.com/support ద్వారా సంప్రదించవచ్చు.

మీరు Xiaomi ఖాతాను రద్దు చేయాలనుకుంటే, దయచేసి రద్దు చేయడం వలన మీరు Xiaomi ఉత్పత్తులు మరియు సేవలను పూర్తి స్థాయిలో వినియోగించలేకుండా నిరోధించబడతారని గుర్తుంచుకోండి. నిర్దిష్ట పరిస్థితులలో రద్దు ప్రక్రియ నిరోధించబడవచ్చు లేదా ఆలస్యం కావచ్చు. ఉదాహరణకు, మీ ఖాతాలో Mi సంగీతానికి సంబంధించి చెల్లించని సభ్యుల సేవ, థీమ్‌ల్లో చెల్లింపు థీమ్‌లు లేదా Mi ఫైనాన్స్‌లో చెల్లించని రుణం మొదలైనటువంటి బకాయి చెల్లింపులు ఇంకా అలాగే ఉన్నట్లయితే, మేము మీ అభ్యర్థనను వెంటనే నెరవేర్చలేము.

మీరు మూడవ పక్షం ఖాతా ద్వారా Xiaomiకి లాగిన్ చేసినట్లయితే, మూడవ పక్షం నుండి ఖాతా రద్దు కోసం దరఖాస్తు చేసుకోవాలి.

6. మీ వ్యక్తిగత డేటా ప్రపంచవ్యాప్తంగా ఎలా బదిలీ చేయబడుతుంది

Xiaomi ప్రపంచవ్యాప్త నిర్వహణ మరియు నియంత్రణ అవస్థాపన ద్వారా వ్యక్తిగత సమాచారాన్ని ప్రాసెస్ చేస్తుంది మరియు బ్యాకప్ చేస్తుంది. ప్రస్తుతం, Xiaomiకి చైనా, భారతదేశం, యునైటెడ్ స్టేట్స్, జర్మనీ, రష్యా, సింగపూర్‌లో డేటా కేంద్రాలు ఉంటాయి. ఈ గోప్యతా విధానంలో వివరించబడిన ప్రయోజనాల కోసం, వర్తించదగిన చట్టానికి లోబడి మీ సమాచారాన్ని ఈ డేటా కేంద్రాలకు బదిలీ చేయవచ్చు.

అలాగే మేము మీ వ్యక్తిగత సమాచారాన్ని మూడవ-పక్షం సేవా ప్రదాతలు మరియు వ్యాపార భాగస్వాములకు బదిలీ చేయవచ్చు మరియు మీ డేటా ఇతర దేశాలు లేదా ప్రాంతాలకు కూడా పంపబడవచ్చు. ఈ ప్రపంచవ్యాప్త సేవా ప్రాంతాలు ఉన్న అధికార పరిధి మీ అధికార పరిధిలో ఉన్నట్లుగా అవే ప్రమాణాలకు వ్యక్తిగత సమాచారాన్ని రక్షించవచ్చు లేదా రక్షించకపోవచ్చు. వివిధ డేటా రక్షణ చట్టాల ప్రకారం విభిన్న రకాల ప్రమాదాలు ఉంటాయి. అయితే, దీని వలన ఈ గోప్యతా విధానానికి లోబడి ఉండాలనే మరియు మీ వ్యక్తిగత సమాచారాన్ని సంరక్షించాలనే మా నిబద్ధతలో ఎలాంటి మార్పు ఉండదు.

వివరంగా,

• చైనీస్ మెయిన్‌ల్యాండ్‌లోని నిర్వహణలలో మేము సేకరించే మరియు ఉత్పాదించే వ్యక్తిగత సమాచారం వర్తించదగిన చట్టం ప్రకారం అనుమతి ఉన్నట్లుగా సీమాంతర బదిలీలకు మినహా చైనీస్ మెయిన్‌ల్యాండ్‌లో ఉన్న డేటా కేంద్రాలలో నిల్వ చేయబడుతుంది.

• రష్యాలోని మా నిర్వహణలలో మేము సేకరించే మరియు ఉత్పాదించే వ్యక్తిగత సమాచారం రష్యన్ చట్టం క్రింద అనుమతి ఉన్నట్లుగా సీమాంతర బదిలీలకు మినహా రష్యాలో ఉన్న డేటా కేంద్రాలలో ప్రాసెస్ చేయబడుతుంది మరియు నిల్వ చేయబడుతుంది.

• భారతదేశంలోని నిర్వహణలలో మేము సేకరించే మరియు ఉత్పాదించే వ్యక్తిగత సమాచారం భారతదేశంలో ఉన్న డేటా కేంద్రాలలో నిల్వ చేయబడుతుంది.

మీరు వ్యక్తిగత సమాచారాన్ని మీ అధికార పరిధి వెలుపలకు అనగా మా అనుబంధ సంస్థలు లేదా మూడవ-పక్షం సేవా ప్రదాతలకు బదిలీ చేయాలనుకుంటే, మేము సంబంధిత వర్తించదగిన చట్టాలకు లోబడి ఉంటాము. మేము ఒకే రకమైన భద్రతా ప్రమాణాలను అమలుపరచడం ద్వారా వర్తించే ప్రదేశిక డేటా రక్షణ చట్టాల యొక్క ఆవశ్యకాలకు అలాంటి బదిలీలు అన్నీ అనుగుణంగా ఉండేలా మేము చూసుకుంటాము. మీరు మా భద్రతా యాంత్రిక చర్యల గురించి మరింత తెలుసుకోవడానికి https://privacy.mi.com/supportలో మమ్మల్ని సంప్రదించవచ్చు.

మీరు యూరోపియన్ ఎకనామిక్ ఏరియా (EEA) పరిధిలో మా ఉత్పత్తులు మరియు సేవలను ఉపయోగిస్తున్నట్లయితే, Xiaomi Technology Netherlands B.V. డేటా కంట్రోలర్‌గా పని చేస్తుంది మరియు Xiaomi Singapore Pte. Ltd. డేటా ప్రాసెసింగ్ కోసం బాధ్యత వహిస్తుంది. సంప్రదింపు వివరాలను "మమ్మల్ని సంప్రదించండి" విభాగంలో కనుగొనవచ్చు.

EEAలో మీ ద్వారా ఉత్పన్నమయ్యే వ్యక్తిగత డేటాను Xiaomi EEA వెలుపల ఉండే Xiaomi సమూహ సంస్థ లేదా మూడవ పక్షం సేవా ప్రదాతకు అందించినప్పుడు, మేము EU ప్రామాణిక ఒప్పంద నిబంధనలు లేదా GDPRలో అందించిన ఏవైనా ఇతర భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా వ్యవహరిస్తాము. మీరు మా భద్రతా యాంత్రిక చర్యల గురించి మరింత తెలుసుకోవడానికి లేదా మా ప్రాథమిక ఒప్పంద క్లాజ్‌ల కాపీని అభ్యర్థించడానికి https://privacy.mi.com/supportలో మమ్మల్ని సంప్రదించవచ్చు.

7. మైనర్‌ల సంరక్షణ

మా ఉత్పత్తులు మరియు సేవలను పిల్లలు వినియోగిస్తున్న తీరును పరిశీలించాల్సిన బాధ్యత వారి తలిదండ్రులు లేదా సంరక్షకులదిగా మేము పరిగణిస్తాము. అయితే, మేము పిల్లలకు నేరుగా సేవలు అందించము లేదా మార్కెటింగ్ ప్రయోజనాల కోసం పిల్లల వ్యక్తిగత సమాచారాన్ని ఉపయోగించము.

మీరు తల్లిదండ్రులు లేదా సంరక్షకులు అయ్యి, వ్యక్తిగత సమాచారంతో Xiaomiని మైనర్‌కు అందించడం జరిగిందని విశ్వసిస్తే, దయచేసి వెంటనే ఆ వ్యక్తిగత సమాచారాన్ని తీసివేసేలా మరియు వర్తించే Xiaomi సేవలలో దేని నుండైనా మైనర్ అన్‌సబ్‌స్క్రయిబ్ చేసేలా చూడటం కోసం https://privacy.mi.com/supportలో మమ్మల్ని సంప్రదించండి.

8. మూడవ పక్ష వెబ్‌సైట్‌లు మరియు సేవలు

మా గోప్యతా విధానం మూడవ పక్షం ద్వారా అందించబడే ఉత్పత్తులు మరియు సేవలకు వర్తించదు. మీరు ఉపయోగించే Xiaomi ఉత్పత్తి లేదా సేవను బట్టి, అది మూడవ పక్షాల ఉత్పత్తులు లేదా సేవలు, వాయిస్ మద్దతు, కెమెరా ప్రాసెసింగ్, వీడియో ప్లేబ్యాక్, సిస్టమ్ క్లీనింగ్ గల సేవలు, భద్రతా సేవలు, గేమింగ్, గణాంకాలు, సామాజిక మాధ్యమాల వినియోగం, చెల్లింపు ప్రాసెసింగ్, మ్యాప్ నావిగేషన్, భాగస్వామ్యం, పుష్, సమాచార ఫిల్టరింగ్, ఇన్‌పుట్ పద్ధతులు మొదలైనవాటిని చేర్చవచ్చు. వీటిలో కొన్ని మూడవ పక్షాల వెబ్‌సైట్‌లకు లింక్‌ల రూపంలో అందించబడతాయి మరియు మరికొన్నింటికి SDKలు, APIలు మొదలైనవాటి రూపంలో ప్రవేశం కల్పించబడుతుంది. మీరు ఈ ఉత్పత్తులు లేదా సేవలను ఉపయోగించినప్పుడు మీ సమాచారం కూడా సేకరించబడవచ్చు. ఈ కారణం దృష్ట్యా, మీరు మాది చదివినట్లుగానే మూడవ పక్షం గోప్యతా విధానాన్ని కూడా జాగ్రత్తగా చదవమని గట్టిగా సూచిస్తున్నాము. మూడవ పక్షాలు మీ నుండి సేకరించే వ్యక్తిగత సమాచారాన్ని ఎలా ఉపయోగిస్తాయనే దానికి మేము బాధ్యత వహించము మరియు నియంత్రించలేము. మా గోప్యతా విధానం మా సేవల నుండి లింక్ చేయబడిన ఇతర సైట్‌లకు వర్తించదు.

మీరు ఎగువ జాబితా చేయబడిన నిర్దిష్ట ఉత్పత్తులను ఉపయోగించినప్పుడు ఏ మూడవ పక్షం నిబంధనలు మరియు గోప్యతా విధానాలు వర్తించవచ్చనే దానికి ఉదాహరణలు క్రింద అందించబడ్డాయి:

మీరు మీ ఆర్డర్‌ను నిర్ధారించి, చెల్లింపు చేయడం కోసం మూడవ పక్షం చెక్-అవుట్ సేవా ప్రదాతను ఉపయోగించినప్పుడు, చెక్ అవుట్ సమయంలో మీరు అందించే వ్యక్తిగత సమాచారం మూడవ పక్షం గోప్యతా విధానానికి అనుగుణంగా నిర్వహించబడుతుంది.

మీరు భద్రత యాప్‌లో భద్రతా స్కాన్ ఫీచర్‌ను ఉపయోగించినప్పుడు, మీరు ఎంచుకునే సేవను బట్టి క్రిందివాటిలో ఒకటి వర్తిస్తుంది:

• Avast గోప్యత మరియు సమాచార భద్రతా విధానం: https://www.avast.com/privacy-policy

• Antiy మొబైల్ భద్రత AVL SDK గోప్యతా విధానం: https://www.avlsec.com/en/privacy-policy

• Tencent సేవా నిబంధనలు: https://privacy.qq.com/

భద్రత యాప్‌లో మీరు క్లీనర్ ఫీచర్‌ని ఉపయోగించినప్పుడు, Tencent గోప్యతా విధానం వర్తిస్తుంది: https://privacy.qq.com

మీరు వివిధ నిర్దిష్ట సిస్టమ్ అప్లికేషన్‌లలో వ్యాపార ప్రకటన సేవలను ఉపయోగించినప్పుడు, మీరు ఎంచుకునే సేవను బట్టి క్రిందివాటిలో ఒకటి వర్తిస్తుంది:

• Google గోప్యతా విధానం: https://www.google.com/policies/privacy

• Facebook గోప్యతా విధానం: https://www.facebook.com/about/privacy/update?ref=old_policy

మీరు Google ఇన్‌పుట్ పద్ధతిని ఉపయోగించినప్పుడు, Google గోప్యతా విధానం వర్తిస్తుంది: https://policies.google.com/privacy

మేము గణాంకాలు విశ్లేషించినప్పుడు, యాప్ క్రాష్ రేట్ పర్యవేక్షిస్తున్నప్పుడు, క్లౌడ్ నియంత్రణ సామర్థ్యాలు అందిస్తున్నప్పుడు, మేము Firebase కోసం Google Analytics లేదా Google Inc. ద్వారా అందించే Firebase Analyticsని ఉపయోగిస్తాము. మీరు Google Firebase గోప్యతా విధానం గురించి మరింత చదవచ్చు: https://policies.google.com/privacy మరియు https://www.google.com/policies/privacy/partners.

ఏవైనా Xiaomi సిస్టమ్ యాప్‌లలో ప్రకటనలను అందించడానికి, మూడవ పక్షం వ్యాపార ప్రకటన భాగస్వాములు మీ ఆన్‌లైన్ కార్యకలాపాల నుండి పొందిన డేటాను సేకరించవచ్చు, మీ ప్రకటన క్లిక్‌లు మరియు కంటెంట్ వీక్షణలు లేదా వెబ్‌సైట్‌లు లేదా యాప్‌లలోని ఇతర కార్యకలాపాలు లాంటివి.

• Google గోప్యతా విధానం: https://www.google.com/policies/privacy

• Facebook గోప్యతా విధానం: https://www.facebook.com/about/privacy/update?ref=old_policy

• Unity గోప్యతా విధానం: https://unity3d.com/legal/privacy-policy

• Vungle గోప్యతా విధానం: https://vungle.com/privacy/

• ironSource గోప్యతా విధానం: https://developers.ironsrc.com/ironsource-mobile/air/ironsource-mobile-privacy-policy/

• AppLovin గోప్యతా విధానం: https://www.applovin.com/privacy/

• Chartboost గోప్యతా విధానం: https://answers.chartboost.com/en-us/articles/200780269

• MoPub గోప్యతా విధానం: https://www.mopub.com/legal/privacy/

• Mytarget గోప్యతా విధానం: https://legal.my.com/us/mail/privacy_nonEU/

• Yandex గోప్యతా విధానం: https://yandex.com/legal/privacy/

• Tapjoy గోప్యతా విధానం: https://www.tapjoy.com/legal/advertisers/privacy-policy/

• AdColony గోప్యతా విధానం: https://www.adcolony.com/privacy-policy/

మా ప్రకటనల భాగస్వాముల కోసం నివేదికలను రూపొందించడానికి, అలాగే మా ప్రకటనలతో మీ ఇంటరాక్షన్ కొలమానాలు పొందడానికి (ఏవైనా ఉంటే) మా వ్యాపార ప్రకటన భాగస్వాముల సూచనలకు అనుగుణంగా మేము మీ సమాచారాన్ని సేకరించవచ్చు మరియు మూడవ పక్షం అట్రిబ్యూషన్ కంపెనీలతో షేర్ చేయవచ్చు. మీరు ఉపయోగించే సిస్టమ్ యాప్స్ ఆధారంగా, మూడవ పక్షం అట్రిబ్యూషన్ కంపెనీలు వీటిని జోడించవచ్చు:

• Adjust గోప్యతా విధానం: https://www.adjust.com/terms/privacy-policy/

• Appsflyer గోప్యతా విధానం: https://www.appsflyer.com/privacy-policy/

• Affise గోప్యతా విధానం: https://affise.com/privacy-policy/

• Miaozhen గోప్యతా విధానం: https://www.miaozhen.com/en/privacy

• Nielsen గోప్యతా విధానం: https://www.nielsen.com/cn/en/legal/privacy-policy/

9. మేము ఈ గోప్యతా విధానాన్ని ఎలా అప్‌డేట్ చేస్తాము

వ్యాపారం, సాంకేతిక పరిజ్ఞానం, వర్తించే చట్టాలు మరియు సహేతుక ఆచరణ విధానాలలో మార్పుల ఆధారంగా మేము గోప్యతా విధానాన్ని నిర్ణీత సమాయలలో సమీక్షించి, ఈ గోప్యత విధానాన్ని అప్‌డేట్ చేసే అవకాశం ఉంటుంది. మేము ఈ గోప్యతా విధానానికి ముఖ్యమైన మార్పు చేసినప్పుడు, ఇమెయిల్ వంటి మీరు నమోదు చేసిన సంప్రదింపు సమాచారం ద్వారా మీకు తెలియజేస్తాము (మీ ఖాతాలో పేర్కొన్న ఇమెయిల్ చిరునామాకు పంపుతాము), Xiaomi వెబ్‌సైట్‌లలో ప్రచురిస్తాము లేదా మొబైల్ పరికరాల ద్వారా మీకు తెలియజేస్తాము, అప్పుడు మేము సేకరించే సమాచారం మరియు మేము దాన్ని ఉపయోగించే విధానం గురించి మీరు తెలుసుకోవచ్చు. గోప్యతా విధానానికి చేసే అటువంటి మార్పులు నోటీసు లేదా వెబ్‌సైట్‌లో పేర్కొనే ప్రభావవంతమైన తేదీ నుండి వర్తింపజేయబడతాయి. మా గోప్యతా పద్ధతులపై తాజా సమాచారం కోసం క్రమం తప్పకుండా ఈ పేజీని తనిఖీ చేయాల్సిందిగా మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాము. వెబ్‌సైట్, మొబైల్ మరియు/లేదా ఇంకేదైనా పరికరంలో ప్రోడక్ట్‌లు మరియు సేవల యొక్క మీ నిరంతర వినియోగం అప్‌డేట్ అయ్యే గోప్యతా విధానానికి లోబడి ఉండాలి. వర్తించే చట్టాల ప్రకారం అవసరమైన సందర్భాలలో, మేము మీ నుండి అదనపు వ్యక్తిగత సమాచారాన్ని సేకరించేటప్పుడు లేదంటే కొత్త ప్రయోజనాల కోసం మీ వ్యక్తిగత సమాచారాన్ని మేము ఉపయోగించేటప్పుడు లేదా వెల్లడించేటప్పుడు మీ ప్రత్యేక సమ్మతి కోరతాము.

10. మమ్మల్ని సంప్రదించండి

ఈ గోప్యతా విధానం గురించి మీరు ఏవైనా వ్యాఖ్యలు చేయాలన్నా లేదా సందేహాలు అడగాలనుకుంటున్నా లేదా మీ వ్యక్తిగత సమాచారాన్ని Xiaomi సేకరించడం, వినియోగించడం లేదా వెల్లడించే విధానాలలో ఏవైనా సందేహాలు ఉన్నా, https://privacy.mi.com/support లింక్‌కు వెళ్లి లేదా కింది చిరునామాలో మమ్మల్ని సంప్రదించండి. వ్యక్తిగత సమాచారం యాక్సెస్ చేయడం లేదా డౌన్‌లోడ్ చేయడం గురించి మేము గోప్యత లేదా వ్యక్తిగత సమాచార అభ్యర్థనలు అందుకున్నప్పుడు, మీ సమస్యలను పరిష్కరించడానికి మా వద్ద ఒక ప్రొఫెషనల్ టీమ్ ఉంది. మీ ప్రశ్నలోనే గణనీయమైన సమస్య ఉన్నట్లయితే, మేము మిమ్మల్ని మరింత సమాచారం కోరవచ్చు.

మీ వ్యక్తిగత సమాచార విషయంలో మా నుండి మీకు అందిన ప్రతిస్పందన సంతృప్తికరమైనదిగా అనిపించకపోతే, మీ జురిస్డిక్షన్‌లోని సంబంధిత డేటా రక్షణ నియంత్రణ సంస్థలకు ఫిర్యాదును సమర్పించవచ్చు. మీరు మమ్మల్ని సంప్రదిస్తే, మీ వాస్తవ పరిస్థితి ఆధారంగా వర్తించే అవకాశం ఉన్న సంబంధిత ఫిర్యాదు ఛానల్‌లకు సంబంధించిన సమాచారాన్ని మేము అందిస్తాము.

Xiaomi Communications Co., Ltd. #019, 9th Floor, Building 6, 33 Xi'erqi Middle Road, Haidian District, Beijing, China 100085

Xiaomi Singapore Pte. Ltd. 20 Cross Street, China Court #02-12 Singapore 048422

భారత దేశంలోని వినియోగదారుల కోసం:

Xiaomi Technology India Private Limited Building Orchid, Block E, Embassy Tech Village, Outer Ring Road, Devarabisanahalli, Bengaluru, Karnataka - 560103, India

గోప్యంగా ఉంచాల్సిన వ్యక్తిగత డేటా లేదా సమాచార ప్రాసెసింగ్‌కి సంబంధించిన ఏవైనా వైరుధ్యాలు, వివాదాలను కింద పేర్కొన్న నిర్దేశిత ఫిర్యాదుల అధికారికి అందించాలి:

పేరు: విశ్వనాథ్ సి

టెలిఫోన్: 080 6885 6286, సోమ-శని ఉ. 9 నుండి సా. 6

ఇమెయిల్: grievance.officer@xiaomi.com

యూరప్ ఆర్థిక ప్రాంతం (EEA)లోని వినియోగదారుల కోసం:

Xiaomi Technology Netherlands B.V. Prinses Beatrixlaan 582, The Hague 2595BM Netherlands

మా గోప్యతా విధానాన్ని చదివేందుకు సమయం కేటాయించినందుకు మీకు ధన్యవాదాలు!

మీకు అందిస్తున్న కొత్త మార్పులు ఏమిటి

మేము కింది విధంగా అనేక అప్‌డేట్‌లు చేశాము:

• మా సంప్రదింపు వివరాలు కొన్నింటిని మేము అప్‌డేట్ చేశాము.

• మేము మరియు మూడవ పక్షం భాగస్వాములు సేకరించిన కొంత సమాచారాన్ని మేము అప్‌డేట్ చేశాము.

• వ్యక్తిగతేతరమైనదిగా గుర్తించే సమాచారాన్ని మేము ఎలా వినియోగిస్తానేది మరింత స్పష్టంగా తెలియజేసాము.

• మేము మీ వ్యక్తిగత సమాచారాన్ని ఎలా ఉపయోగిస్తామనే విధానాన్ని అప్‌డేట్ చేసాము, అదే విధంగా మా చట్టబద్ధమైన ప్రయోజనాల ఆధారంగా మరియు మీ పుష్ సేవల వినియోగానికి సంబంధించి వ్యక్తిగత సమాచారాన్ని మేము ఎప్పుడు ప్రాసెస్ చేస్తాము అనే విషయాలు మరింత వివరంగా పేర్కొన్నాము.

• డేటా నిల్వ గురించి మరిన్ని వివరాలను అందించాము.

• మీ వ్యక్తిగత సమాచారం పట్ల మీ హక్కుల గురించి మరింత స్పష్టంగా పేర్కొన్నాము.